రూ.4 వేలకే బిగ్ బజార్‌లో Redmi 5A, ఫోన్ ఫీచర్లు, ఇతర డిస్కౌంట్లపై లుక్కేయండి !
చైనా దిగ్గజం షియోమీకి చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 5ఏ ను ఇప్పుడు మరింత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం బిగ్ బజార్ కల్పిస్తోంది.
చైనా దిగ్గజం షియోమీకి చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్ మీ 5ఏ ను ఇప్పుడు మరింత తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం బిగ్ బజార్ కల్పిస్తోంది. రిపబ్లిక్ డే సేల్ కార్యక్రమంలో భాగంగా ఈ మేరకు ఆఫర్ ప్రకటించింది. కాగా రెడ్ మీ 5ఏ ఫోన్ ఆన్ లైన్లో ఎంఐ డాట్ కామ్, ఫ్లిప్‌కార్ట్ డాట్ కామ్ నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. కాగా బిగ్ బజార్‌లో దీని ఎంఆర్పీ రూ.5,499గా ఉంది. యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం తగ్గింపునిస్తోంది. అంటే రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. దీనికి అదనంగా ఫ్యూచర్ పే వ్యాలెట్ లో రూ.1,000 క్యాష్ బ్యాక్ క్రెడిట్ అవుతుంది. ఫిబ్రవరి నుంచి ఐదు నెలల పాటు ప్రతీ నెలా రూ.200 జమ అవుతుంది. ఈ ఆఫర్ ఈ నెల 22 నుంచి 28 వరకు లేదా స్టాక్స్ అయిపోయే వరకే అమల్లో ఉంటుంది.

రెడ్ మీ 5ఏ స్పెసిఫికేషన్స్
5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2జీబీ/ 3జీబీ ర్యామ్, 16జీబీ/ 32జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ. Android Nougat-based MIUI 9 3,000mAh battery dual-SIM phone supports 4G LTE, VoLTE and USB OTG.

మూడు కలర్లలో
మూడు కలర్లలో ఫోన్ మొత్తం మూడు కలర్లలో Dark Grey, Gold and Rose Gold లభ్యమవుతోంది. కాగా ఈ ఫోన్ Redmi 4A విజియవంతం అయిన నేపధ్యంలో దానికి కొంచెం అదనపు ఫీచర్లు జోడించి మార్కెట్లోకి తీసుకువచ్చింది.

2జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.4,999కు
కాగా ప్రస్తుతానికి 2జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.4,999కు కంపెనీ విక్రయిస్తోంది. అలాగే 3జీబీ ర్యామ్ వెర్షన్‌ను కూడా ఆన్‌లైన్, ఎంఐ హోమ్ స్టోర్ల వద్ద రూ.6,999కు విక్రయిస్తోంది. కాగా ఆఫ్‌లైన్‌కు వచ్చేసరికి 3జీబీ ర్యామ్ వేరియంట్ ధరను షియోమి పెంచేసింది.

3జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,499
3జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,499కు.. 3జీబీ ర్యామ్ వేరియంట్‌ను రూ.7,499కు ఆఫ్‌లైన్ స్టోర్లలో విక్రయిస్తామని కంపెనీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. అంటే లాంచింగ్ ధర కన్నా రూ. 500 ఎక్కువ పెట్టి కొనుగోలు దారులు దీన్ని తీసుకోవాల్సి ఉంటుంది.

రూ. 199 ప్లాన్ తో రీఛార్జ్
ఈ ఫోన్ కొన్న వారు జియోసిమ్ తీసుకుని రూ. 199 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కంపెనీ జియో కంపెనీ రూ. 100 చొప్పున 10 నెలల పాటు క్యాష్ ఓచర్ అందించనుంది. అయితే రూ. 199 ప్లాన్ 12 నెలల పాటు కంటిన్యూగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.

మై జియో యాప్ లో..
ఈ క్యాష్ బ్యాక్ ను మీరు మై జియో యాప్ లో మై ఓచర్లో చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను మీ తదుపరి రీఛార్జ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

నేటి నుంచి షియోమి రిపబ్లిక్ డే సేల్
కాగా నేటి నుంచి షియోమి రిపబ్లిక్ డే సేల్ ఎంఐ.కామ్‌లో నిర్వహించబోతోంది. ఈ సేల్‌లో భాగంగా మొబైల్ ఫోన్లు, ఆడియో యాక్ససరీస్, పవర్ బ్యాంక్స్, హోమ్ గాడ్జెట్స్, ఇతర ఉత్పత్తులపై షియోమి ప్రకటించింది. కాగా నేటి అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యే ఈ సేల్, రిపబ్లిక్ డే వరకు కొనసాగనుంది.


Click it and Unblock the Notifications








