షియోమి Desh ka Smartphone, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్

Written By:

షియోమి నుంచి అత్యంత తక్కువ ధరలో మరో మొబైల్ రాబోతోంది. దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో షియోమి ఈ ఫోన్ ను ఇండియా మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంది. రేపు లాంచింగ్ కాబోతున్న ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ క్లూజివ్ గా అమ్మకానికి రానుంది. ఈ ఫోన్ రాకతో మిగతా కంపెనీల బడ్జెట్ ఫోన్లు కొంచెం కష్టాలకు గురి అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మొబైల్స్ గురించి నమ్మలేని నిజాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెడ్‌మి 5ఏనే దేశ్ కా స్మార్ట్‌ఫోన్

షియోమి నుంచి రానున్న ఈ ఫోన్ పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. రెడ్‌మి 5ఏనే దేశ్ కా స్మార్ట్‌ఫోన్ గా రాబోతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర కూడా సుమారు రూ.5,800గా ఉండవచ్చని అంచనా..ఇప్పుడు మార్కెట్లో షియోమి ఫోన్లలో అత్యంత తక్కువ ధరకు లభించే ఫోన్ రెడ్‌మి 4ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే.

షియోమీ రెడ్‌మీ 5ఎ ఫీచర్లు ( అంచనా )

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

పలు ఆఫర్లను..

కాగా ఈ ఫోన్ తో పాటు పలు ఆఫర్లను షియోమి ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య కార్బూన్ నుంచి వచ్చిన ఎయిర్‌టెల్ అలాగే ఇతర ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిస్తుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

త్వరలో రెడ్‌మి నోట్ 5

కాగా షియోమి నుంచి త్వరలో రెడ్‌మి నోట్ 5 దూసుకురానున్న సంగతి తెలిసిందే. అయితే మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందనే దానిపై కంపెనీ ఇంకా ఎటువంటి స్పష్టత నివ్వలేదు. రెడ్‌మి నోట్ 4 విజయవంతం అయిన నేపథ్యంలో రెడ్‌మి నోట్ 5 కూడా అదే ఊపును కొనసాగిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు (అంచనా )

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi 'Desh ka Smartphone' Will Be Exclusive to Flipkart More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot