Redmi 5Aపై ఆఫర్లు, రూ. 3999కే సొంతం చేసుకోమంటున్న జియో
దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో షియోమి దేశీయ మార్కెట్లోకి తన రెడ్‌మి 5Aని లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
దేశ్ కా స్మార్ట్‌ఫోన్ పేరుతో షియోమి దేశీయ మార్కెట్లోకి తన రెడ్‌మి 5Aని లాంచ్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. 2/3జిబి ర్యామ్‌లతో వచ్చిన ఈ ఫోన్ ధరను కంపెనీ వరుసగా రూ. 5,999, 6,999గా నిర్ణయించింది. కాగా ఫస్ట్ 50 లక్షల యూనిట్ల ధరను కంపెనీ రూ. 4999గా నిర్ణయించింది. ఈ ఫోన్ రావడంపై చాలామంది వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అసలైన దేశ్ కా స్మార్ట్‌ఫోన్ ఇదేనంటూ నెటిజన్లు ట్విట్టర్లలో ట్వీట్ చేస్తున్నారు. కాగా ఈ ఫోన్ మీద జియో ఆఫర్ కూడా ప్రకటించింది.

రూ. 199 ప్లాన్ తో రీఛార్జ్
ఈ ఫోన్ కొన్న వారు జియోసిమ్ తీసుకుని రూ. 199 ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే కంపెనీ జియో కంపెనీ రూ. 100 చొప్పున 10 నెలల పాటు క్యాష్ ఓచర్ అందించనుంది. అయితే రూ. 199 ప్లాన్ 12 నెలల పాటు కంటిన్యూగా రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వర్తిస్తుంది.

మై జియో యాప్ లో..
ఈ క్యాష్ బ్యాక్ ను మీరు మై జియో యాప్ లో మై ఓచర్లో చెక్ చేసుకోవచ్చు. ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ ను మీ తదుపరి రీఛార్జ్ కొరకు ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్ వచ్చే ఏడాది నవంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది.

షియోమి రెడ్‌మి 5ఎ ఫీచర్లు
5-inch 720p IPS LCD display
2/3 జిబి ర్యామ్, 16/32 జిబి ఇంటర్నల్ మెమొరీ, 128 జిబి విస్తరణ సామర్ధ్యం,
13 ఎంపీ కెమెరా, 1080 ఫిక్సల్ తో వీడియో షూట్ సామర్ధ్యం
5 ఎంపీ సెల్ఫీ షూటర్
Android Nougat-based MIUI 9
3,000mAh battery
dual-SIM phone supports
4G LTE, VoLTE and USB OTG.

డిసెంబర్ 7 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు..
డిసెంబర్ 7 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో తొలిసేల్ ప్రారంభం కానుంది. ఫోన్ మొత్తం మూడు కలర్లలో Dark Grey, Gold and Rose Gold లభ్యమవుతోంది. కాగా ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి నోటిఫై ఆప్సన్ ఇచ్చింది.


Click it and Unblock the Notifications








