Home
Mobile

8 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Redmi 5A

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అగ్రగామి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌‍గా అవతరించిన ‘షావోమీ’ (Xiaomi) మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది.

By Bommu Sivanjaneyulu

బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో అగ్రగామి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌‍గా అవతరించిన 'షావోమీ’ (Xiaomi) మరో కొత్త ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. కొద్ది రోజుల క్రితమే తన Redmi Note 5A ఫోన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసిన ఈ బ్రాండ్ తాజగా Redmi 5Aను అందుబాటులోకి తీసుకువచ్చేసింది.

Xiaomi Redmi 5A With '8-Day Battery Life', Snapdragon 425 Launched

ఈ ఫోన్‌కు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. డిజైనింగ్ పరంగా Redmi 4 మోడల్‌ను తలపిస్తోన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ గుండ్రటి ఎడ్జులతో వస్తోంది. MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ మిస్ అయ్యింది. 137 గ్రామల బరువుతో వస్తోన్న ఈ ఫోన్ చేతిలో సౌకర్యవంతంగా ఇమిడి పోతుందని కంపెనీ చెబుతోంది.

ఈ ఫోన్‌లో నిక్షిప్తం చేసిన 3000mAh బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 8 రోజుల బ్యాటర్ లైఫ్‌ను ఆఫర్ చేయగలదట. చైనా మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు CNY 599 (ఇంచుమించుగా మన కరెన్సీలో రూ.6000లోపు). ప్రీ-ఆర్డర్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కంపెనీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు చైనా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఈ-కామర్స్ సైట్‌లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

Redmi 5A స్పెసిఫికేషన్స్...

5-ఇంచ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280 పిక్సల్స్) విత్ 296 పీపీఐ, లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేయబడిన MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్‌, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ క్వాడ్-కోర్ 425 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : f/2.2 అపెర్చుర్, బరస్ట్ మోడ్, పానోరమా మోడ్, హెచ్‌డి‌ఆర్ మోడ్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3000mAh బ్యాటరీ, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, 3జీ, జీపీఆర్ఎస్, ఎడ్జ్, బ్లుటూత్, వై-ఫై, మైక్రో యూఎస్బీ.

Redmi 5Aకు సీనియర్ వర్షన్ అయిన Redmi Note 5A సరిగ్గా నెలరోజుల క్రితమే చైనా మార్కెట్లో లాంచ్ అయ్యింది. 4జీబి ర్యామ్‌తో వచ్చే వేరియంట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ధర మన కరెన్సీలో రూ.12,000.

Redmi Note 5A (4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్) వేరియంట్ స్పెసిఫికేషన్స్.. 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ లెటెస్ట్ వర్షన్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 సాఫ్ట్‌వేర్, క్వాల్కమ్ Snapdragon 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, Adreno 505 GPU, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్, పీడీఏఎఫ్, f/2.2 aperture, హెచ్‌డీఆర్ మోడ్, రియల్ టైమ్ ఫిల్టర్స్), 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు : 76 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్, ఇండిపెండెంట్ సాఫ్ట్ లైట్ ఫ్లాష్, f/2.0 aperture, రియల్ లైమ్ బ్యూటీ ఫిల్టర్స్), 3080mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ సిమ్ సపోర్ట్ (నానో + నానో), యూఎస్బీ టైప్-సీ సపోర్ట్, 4జీ, బ్లుటూత్ వీ4.2, వై-ఫై 802.11 b/g/n, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్ + గ్లోనాస్, స్లీక్ మెటల్ బాడీ, డ్యుయల్ స్పీకర్ గ్రిల్స్, 3.5ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఫోన్ బరువు 150 గ్రాములు, చుట్టుకొలత 153x76.2x7.5 మిల్లీ మీటర్లు.

Redmi 5A సిరీస్ ఫోన్‌లను ఈ ఏడాది చివరిలోపు లేదా వచ్చే ఏడాది ఆరంభంలో ఇండియకు తీసుకువచ్చే అవకాశముంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 5A With '8-Day Battery Life', Snapdragon 425 Launched: Price, Pre-Orders, and Specifications. Read More in Telugu Gizbot
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X