షియోమి నుంచి Redmi సీరిస్‌లో మరో కొత్త స్మార్ట్‌ఫోన్, లీకైన ఫీచర్లు మీకోసం !

చైనా దిగ్గజం షియోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది.

|

చైనా దిగ్గజం షియోమి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు షియోమి కంపెనీ త్వరలో లాంచ్ చేయబోతున్న ఫోన్ వివరాలు సోషల్ మీడియాలో లీకయ్యాయి. షియోమి రెడ్‌మి 6 ప్రొ పేరుతో కంపెనీ ఈ సరికొత్త ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఈ నెల 25న లాంచ్ చేయనుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా లీకైన ఇమేజెస్‌లో స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ వివరాలు హైలెట్‌ అయ్యాయి. చైనీస్‌ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ వైబో ఈ ఇమేజ్‌లను లీక్‌చేసింది.

Redmi 5కి దిమ్మతిరిగే కౌంటర్,అదిరే ఫీచర్లతో Meizu M6, రూ.7,699కే !Redmi 5కి దిమ్మతిరిగే కౌంటర్,అదిరే ఫీచర్లతో Meizu M6, రూ.7,699కే !

 టాప్‌-నాచ్‌ డిస్‌ప్లే

టాప్‌-నాచ్‌ డిస్‌ప్లే

రెడ్‌మి 6 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరిగా టాప్‌-నాచ్‌ డిస్‌ప్లేను కలిగి ఉందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని టీనా లిస్టింగ్‌ కూడా అంతకముందే రివీల్‌ చేసింది.

Image source : Vibo, teena

నిలువుగా అమర్చిన రెండు కెమెరాలు

నిలువుగా అమర్చిన రెండు కెమెరాలు

నిలువుగా అమర్చిన రెండు కెమెరాలను కూడా ఈ ఫోన్‌ కలిగి ఉందని లీక్‌ అయిన ఇమేజ్‌లు చూపిస్తున్నాయి. వెనుకవైపు సర్క్యూలర్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌ను ఇది కలిగి ఉంటుందని సమాచారం.

 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌

4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌

ఎంఐయూఐ 9.6 ఆధారిత ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఆన్‌బోర్డ్‌ స్టోరేజ్‌తోనూ రెడ్‌మి 6 ప్రొ మార్కెట్‌లోకి వస్తుందని లీకయిన వివరాలు చెబుతున్నాయి.

టీనా లిస్టింగ్‌ ప్రకారం

టీనా లిస్టింగ్‌ ప్రకారం

టీనా లిస్టింగ్‌ అంతకముందు రివీల్‌ చేసిన దాని ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్‌కు 5.84 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్‌ సీపీయూ, 2 గిగాహెడ్జ్‌, 5ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఉంటుందని తెలిసింది.

వివరాలు గోప్యం

వివరాలు గోప్యం

రెడ్‌మి 6 ప్రొతో మార్కెట్‌లోకి వస్తున్న ఎంఐ ప్యాడ్‌ 4, 8 అంగుళాల స్క్రీన్‌తో మార్కెట్‌లోకి వస్తుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించేసింది.అయితే రెడ్‌మి 6 ప్రొకి సంబంధించిన వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది.

ఎంఐ ప్యాడ్‌

ఎంఐ ప్యాడ్‌

అంతకముందు రిపోర్టుల ప్రకారం ఎంఐ ప్యాడ్‌కు క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 660 ఎస్‌ఓసీ, 13 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌, 5 ఎంపీ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా, 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటున్నాయని తెలిసింది.

 రెడ్‌మి 5 ప్రొ విజయవంతమైన నేపథ్యంలో

రెడ్‌మి 5 ప్రొ విజయవంతమైన నేపథ్యంలో

కాగా రెడ్‌మి నోట్ 5 ప్రొ విజయవంతమైన నేపథ్యంలో దానికి successorగా ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. రెడ్‌మి 5 ప్రొకి కొన్ని అధునాతన ఫీచర్లను జోడించుకుని ఈ ఫోన్ వినియోగదారుల చెంతకు రానుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6 Pro launch on June 25: Specifications, features and everything else we know at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X