సరికొత్త ఫోన్‌,రూటర్‌తో దూసుకొస్తున్న షియోమి

|

చైనా దిగ్గజం షియోమి దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. ఇప్పటికే ఇండియాలో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన ఈ ఫోన్ ఇప్పుడు మళ్లీ మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా ఈ నెల 22న Redmi Note 6 Pro విడుదల చేసేందుకు సర్వం సిద్దం చేసుకుంది. అయితే దీంతో కంపెనీ ఆగడం లేదు. మరో కొత్త ఫోన్ తో దూసుకువచ్చేందుకు రెడీ అయిందని MySmartPrice క్లయిమ్ చేసింది. ఈ ఫోన్ రోజ్ గోల్డ్ కలర్ లో లాంచ్ కానుందని దీంతో పాటు మి రూటర్ 4సి కూడా అదే రోజు లాంచ్ కానుందని మైస్మార్ట్‌ప్రైస్ రిపోర్ట్ చేసింది. కాగా షియోమి ఇప్పటికే మి రూటర్లను లాంచ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మి రూటర్ 4 సీరిస్ లో ఇది మూడవ వేరియంట్. దేశంలో ఇప్పటికే మి రూటర్ 3సి అందుబాటులో ఉంది.

 

మార్కెట్లో ఉన్న బెస్ట్ ,వరస్ట్ ప్లాన్ల గురించి తెలుసుకోండి

షియోమి రెడ్‌మి ప్రొ ధర

షియోమి రెడ్‌మి ప్రొ ధర

ఈ ఫోన్ నాచ్ డిస్‌ప్లేతో వచ్చింది. గత సెప్టెంబర్ నెలలో రెండు స్టోరేజ్ వేరియంట్లను కంపెనీ లాంచ్ చేసింది. 3జిబి ర్యామ్ 32 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. అలాగే 4జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. ఇది బ్లూ, గోల్డ్ ,బ్లాక్ రంగుల్లో లభ్యమవుతోంది. అయితే కంపెనీ కొత్తగా రోజ్ గోల్డ్ కలర్ ని మార్కెట్లోకి లాంచ్ చేసింది.

షియోమి మి రూటర్ ప్రైస్

షియోమి మి రూటర్ ప్రైస్

దేశీయంగా ఉపయోగించుకునేందుకు మిరూటర్ 4సి పేరుతో సరికొత్త రూటర్ ని మార్కెట్లోకి తీసుకొస్తోంది. కాగా దీని ధర సుమారు 99 యువాన్లు నిర్ణయించినట్లుగా సమాచారం. మన కరెన్సీలో సుమారు దీని ధర రూ. 1000గా ఉండనుంది.

మిరూటర్ 4క్యూ కన్నా తక్కువ
 

మిరూటర్ 4క్యూ కన్నా తక్కువ

ఈ రూటర్ ధర మిరూటర్ 4క్యూ కన్నా చాలా తక్కువగా చెప్పవచ్చు. దీని ధర మార్కెట్లో ఇప్పుడు రూ.2000గా ఉంది. కాగా రానున్న రూటర్ మిరూటర్ 3సికి రీప్లేస్ గా ఉండనుంది. ఈ రూటర్ నాలుగు 5dBi omni-directional antennasను కలిగి ఉండటంతో పాటు 64MB storage spaceను కలిగి ఉంది. Android or iOS device రెండింటిని ఇది కంట్రోల్ చేస్తోంది. సింగిల్ బాండ్ 2.4GHz Wi-Fi connectivity rendering speedsతో పాటు 300Mbps వేగాన్ని ఇది కలిగి ఉంది. 10 meters వరకు వైఫై కవరేజ్ ని ఇది అందుకోగదు. అలాే 64 డివైస్ ల వరకు దీన్ని వాడుకోవచ్చని కంపెనీ తెలిపింది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6 Pro Rose Gold variant and Mi Router 4C to be launched in India soon more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X