Redmi 6 స్మార్ట్‌ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్!
షియోమీ రెడ్‌మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి.
షియోమీ రెడ్‌మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నాయి. సెప్టంబర్ 5వ తేదీన నిర్వహించే స్పెషల్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా రెడ్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది.

కొత్త లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను...
ఈ కొత్త లాంచ్ ఈవెంట్‌కు సంబంధించిన వివరాలను షియోమీ గ్లోబల్ వైస్ ప్రెసిడింట్ ఇంకా షియోమీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జెయిన్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. రెడ్‌మి 6, రెడ్‌మి 6 ప్రో, రెడ్‌మి 6ఏ మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

రెడ్‌మి 6 స్పెసిఫికేషన్స్..
ఈ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 9 స్కిన్ పై రన్ అవుతుంది. ఫోన్ ఇతర స్పెక్స్ పరిశీలించినట్లయితే.. 5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 720x1440 పిక్సల్స్), ఆక్టాకోర్ 12ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో పీ22 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ.

రెడ్‌మి 6ఏ స్పెసిఫికేషన్స్..
5.45 అంగుళాల హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 720x1440 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 12 ఎన్ఎమ్ మీడియాటెక్ హీలియో ఏ22 సాక్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,000mAh బ్యాటరీ. చైనా మార్కెట్లో రెడ్‌మి 6ఏ ధర CNY 599గా ఉంది. (ఇండియన్ కరెన్సీలో ఈ విలువ షుమారుగా రూ.6,300)

రెడ్‌మి 6ప్రో స్పెసిఫికేషన్స్..
5.84 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ కెపాసిటీ వచ్చేసరికి 1080x2280 పిక్సల్స్), ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 యూజర్ ఇంటర్‌ఫేస్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 సాక్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), డెడికేటెడ్ మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,000mAh బ్యాటరీ.


Click it and Unblock the Notifications








