Home
Mobile

త్వరలో మార్కెట్లోకి రెడ్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు

చైనా మొబైల్ దిగ్గజం షియోమి త్వరలోనే రెడ్‌మి 5 సిరీస్ ఫోన్ల స్థానంలో రెడ్‌మి 6 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది.

By Hazarath Aiah

చైనా మొబైల్ దిగ్గజం షియోమి త్వరలోనే రెడ్‌మి 5 సిరీస్ ఫోన్ల స్థానంలో రెడ్‌మి 6 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది. దీని ధర వివరాలను ఇంకా వెల్లడించలేదు.కాగా కంపెనీ రెడ్‌మి 6తోపాటు 6ఎ ఫోన్‌ను సైతం తీసుకురానుంది. స్మార్ట్ ఫోన్ల విడుదలకు ముందు సర్టిఫై చేసే టెనా వెబ్ సైట్లో ఈ ఫోన్ల వివరాలు కనిపించాయి. రెడ్‌మి 6 ఫోన్ లో ఉండే స్పెసిఫికేషన్ల వివరాలు కొన్ని బయటకు వచ్చాయి. పలు ఆకట్టుకునే ఫీచర్లను యూజర్లకు అందిస్తున్నారు.

redmi 6

షియోమీ రెడ్‌మి 6 ఫీచర్లు
ఇందులో 5.45 అంగుళాల 18:9 యాస్పెక్ట్ రేషియోతో కూడిన డిస్ ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెర్జ్ ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ ఓరియో 8.1 ఆపరేటింగ్ సిస్టమ్, 3,000 ఎంఏహెచ్ బ్యాటరీ, ముందు భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో రెండు కెమెరాలు అందులో ఒకటి 12 మెగాపిక్సల్ కెమెరా ఉండనున్నాయి. 2జీ ర్యామ్, 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వెర్షన్లతో ఇది రానుంది. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, వంటి ఫీచర్లు ఉండనున్నాయి.ఇందులో నాచ్ డిస్ ప్లే ఉంటుంది. అతి త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

కాగా కంపెనీ రెడ్‌మి 5ను మార్చిలో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. రెడ్‌మీ 5 స్మార్ట్‌ఫోన్ 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్ వేరియెంట్లలో లాంచ్ అయింది.
2జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర 7,999 రూపాయలుగా కంపెనీ ప్రకటించింది. రెండో వేరియంట్‌ 3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌. దీని ధర 8,999 రూపాయలుగా పేర్కొంది. మరొకటి 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌. దీని ధర 10,999 రూపాయలుగా షియోమి తెలిపింది.

redmi 6

షియోమీ రెడ్‌మీ 5 ఫీచర్లు
5.7 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 720 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 450 ప్రాసెసర్, 2/3/4 జీబీ ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నౌగట్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా (ఫ్లాష్), 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.ఫేస్‌ రికగ్నైజేషన్‌, స్మార్ట్‌ బ్యూటీ 3.0 యాప్‌. బ్లాక్‌, గోల్డ్‌, లేక్‌ బ్లూ, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6, Redmi 6A clear TENAA certification, could launch soon More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X