ఇండియాకి షియోమి నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు, బడ్జెట్ ధరకే !
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి రెడ్‌మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.
చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి రెడ్‌మి సిరీస్ నుంచి మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లు ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. సెప్టంబర్ 5న నిర్వహించిన స్పెషల్ లాంచ్ ఈవెంట్‌లో భాగంగా రెడ్‌మి 6 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను కంపెనీ ఆవిష్కరించింది. రెడ్‌మి 6, రెడ్‌మి 6 ప్రో, రెడ్‌మి 6ఏ మోడల్స్‌లో ఈ ఫోన్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే చైనా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వీటి ధరలు, అలాగే ఫీచర్లు లాంటి విషయాలను మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

రెడ్‌మి 6
ధరలు
3జీబీ + 32జీబీ వేరియంట్ ధర రూ. 7,999
3జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 9,499
సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి వస్తున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.అయితే ఫస్ట్ సేల్‌కే ఈ ఆఫర్ పరిమితం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6ఏ
ధరలు
2జీబీ+16జీబీ వేరియంట్ ధర రూ. 5,999
2జీబీ+32జీబీ వేరియంట్ ధర రూ. 6,999
సెప్టెంబర్ 10న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి వస్తున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.అయితే ఫస్ట్ సేల్‌కే ఈ ఆఫర్ పరిమితం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు
5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6ప్రో
ధరలు
3జీబీ + 32జీబీ : ధర రూ.10,999
4జీబీ+ 64జీబీ : ధర రూ.12,999
సెప్టెంబర్ 11న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా విక్రయానికి వస్తున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.అయితే ఫస్ట్ సేల్‌కే ఈ ఆఫర్ పరిమితం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications








