తొలిసారిగా సేల్‍కి రానున్న రెడ్‌మి 6 ఫోన్, Flipkartలో ఎక్స్ క్లూజివ్.

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి రెడ్‌మి సిరీస్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో రెడ్‌మి 6 తొలిసారిగా ఇండియాలో అమ్మకానికి వచ్చింది.

By Anil
|

ఇండియా మార్కెట్లో దూసుకుపోతున్న చైనా దిగ్గజం షియోమి రెడ్‌మి సిరీస్ ఫోన్ ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన విషయం తెలిసిందే . ఈ నేపథ్యంలో రెడ్‌మి 6 తొలిసారిగా ఇండియాలో అమ్మకానికి వచ్చింది. నేటి నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను భారత్‌లో ప్రారంభించనున్నట్టు షియోమి ప్రకటించింది. కాగా ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి ,ఫ్లిప్ కార్ట్ , ఎమ్‌ఐ.కామ్‌లో ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది.కాగా మిగితా రెండు ఫోన్లు అయిన రెడ్‌మి 6 ప్రో, రెడ్‌మి 6ఏ కూడా ఈ నెలలో విడుదల కానున్నాయి. రెడ్‌మి 6 ప్రో ఈ గురువారం అనగా సెప్టెంబర్ 13న మార్కెట్లోకి విడుదల అవుతుండగా రెడ్‌మి 6ఏ మాత్రం వచ్చే బుధువారం అనగా సెప్టెంబర్ 19న మార్కెట్లోకి రానుంది.

రెడ్‌మి 6 ధర...

రెడ్‌మి 6 ధర...

3జీబీ + 32జీబీ వేరియంట్‌ ధర రూ. 7,999
3జీబీ + 64జీబీ వేరియంట్‌ ధర రూ. 9,499
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్ కార్డు/క్రెడిట్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది..అయితే ఫస్ట్‌ సేల్‌కే ఈ ఆఫర్‌ పరిమితం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు....

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6ప్రో...

రెడ్‌మి 6ప్రో...

ధరలు
3జీబీ + 32జీబీ : ధర రూ.10,999
4జీబీ+ 64జీబీ : ధర రూ.12,999
సెప్టెంబర్ 13న ఫ్లిప్‌కార్ట్‌,MI స్టోర్ లో ప్రత్యేకంగా విక్రయానికి వస్తున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.అయితే ఫస్ట్‌ సేల్‌కే ఈ ఆఫర్‌ పరిమితం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు....

షియోమీ రెడ్‌మీ 6 ప్రొ ఫీచర్లు....

5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ స్నాప్‌డ్రాగన్ 625 ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మి 6ఏ....

రెడ్‌మి 6ఏ....

ధరలు
2జీబీ+16జీబీ వేరియంట్‌ ధర రూ. 5,999
2జీబీ+32జీబీ వేరియంట్‌ ధర రూ. 6,999
సెప్టెంబర్ 19న ఫ్లిప్‌కార్ట్‌,MI స్టోర్ లో ప్రత్యేకంగా విక్రయానికి వస్తున్నాయి.హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు వినియోగదారులకు 500 రూపాయలు ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది.అయితే ఫస్ట్‌ సేల్‌కే ఈ ఆఫర్‌ పరిమితం కానుంది.

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు....

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు....

5.45 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 6 to Go on Sale for the First Time in India Today, via Flipkart and Mi.com.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X