రెడ్‌మి 8 ఫ్లాష్ సేల్స్... అందుబాటులో గొప్ప ఆఫర్స్
షియోమి సంస్థ ఇటీవల విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లలో రెడ్‌మి 8 యొక్క సేల్స్ ఈ రోజు మరోసారి జరగనున్నాయి. ఈ సేల్స్ మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్ మరియు Mi.com ద్వారా ప్రారంభమవుతుంది. షియోమి 5 మిలియన్ యూనిట్ల మార్కును చేరుకునేంత వరకు దీనిని రూ.7,999ల ధర వద్ద స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చు. ఈ ధర వద్ద 4GB RAM మరియు 64GB స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. ఒనిక్స్ బ్లాక్, రూబీ రెడ్ మరియు నీలమణి బ్లూ కలర్ ఎంపికలలో ఇది కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఆఫర్స్
ఆఫర్‌ల విషయానికొస్తే దీనిని కొనుగోలు చేయడానికి ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అలాగే హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ కార్డు వినియోగదారులు 10 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే నెలకు 667 రూపాయల నుండి ప్రారంభమయ్యే EMI ఎంపికలు కూడా అందుబాటులో ఉన్నాయి.

స్పెసిఫికేషన్స్
రెడ్‌మి 8 కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ గల 6.22-అంగుళాల HD + నాచ్ డిస్ప్లేని కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 చిప్‌సెట్ చేత రన్ అవుతుంది. ఇందులో 4GB RAM తో పాటు 64GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇందులో గల ప్రత్యేక SD కార్డ్ స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు.

ఫీచర్స్
రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ 6.22-అంగుళాల హెచ్‌డి + డిస్‌ప్లేతో వస్తుంది. రెడ్‌మి 7 మాదిరిగానే ఇది కూడా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ వాటర్‌డ్రాప్ నాచ్ తో వస్తుంది. AI సెల్ఫీ కెమెరా పోర్ట్రెయిట్ మోడ్‌కు మరియు ఫేస్ అన్‌లాక్‌కు మద్దతు ఇస్తుంది. వెనుక కెమెరా సెటప్ విషయానికి వస్తే ఇది 12 మెగాపిక్సెల్ మెయిన్ షూటర్ కెమెరా సోనీ IMX363 సెన్సార్‌తో జత చేయబడి ఉంటుంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో సెకండరీ కెమెరాను కలిగి ఉంటుంది. 104 భాషల మధ్య గూగుల్ లెన్స్ ఇంటిగ్రేషన్ ఆఫర్ ట్రాన్సలేషన్ కూడా ఉంది.

కనెక్టివిటీ
రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 439 SoC ఆధారంగా పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ P2i ప్రొటెక్టెడ్ కోటెడ్ తో వస్తుంది. ఇది స్ప్లాష్ ప్రూఫ్ మరియు MIUI ఆధారంగా రన్ అవుతుంది. వెనుకవైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ తో 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇందులో USB టైప్-సి పోర్ట్,డ్యూయల్ సిమ్,4G కనెక్టివిటీ,వై-ఫై వంటి కనెక్టివిటీలతో ప్యాక్ చేయబడి వస్తుంది.


Click it and Unblock the Notifications








