సరికొత్త ఫీచర్లతో రిలీజ్ కు సిద్దమవుతున్న షియోమి రెడ్‌మి 8

|

షియోమి యొక్క సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి 8 ను ఈ రోజు ఉదయం 11:00 గంటలకు ఇండియాలో విడుదల చేయనున్నారు. ఈ ప్రయోగ కార్యక్రమాన్ని షియోమి ఇండియా యొక్క అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. పెద్ద బ్యాటరీ,గొప్ప కెమెరా ఫీచర్లు గల ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఉన్న రెడ్‌మి 7 కి అప్డేట్ వెర్షన్ గా రాబోతున్నది.

రెడ్‌మి 8
 

ప్రముఖ చైనా కంపెనీ షియోమి ఇటీవల ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మి 8ను టీజ్ చేయడం ప్రారంభించింది. లిస్టింగ్ ప్రకారం కొత్త రెడ్‌మి ఫోన్ యొక్క మెయిన్ కెమెరా సోనీ సెన్సార్‌ను కలిగి ఉండి డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది "ఇండస్ట్రీ-లీడింగ్" ఎడ్జ్ డిటెక్షన్ మరియు స్కిన్ టోన్ మ్యాపింగ్ వంటి లక్షణాలకు మద్దతునిస్తుంది.

అమెజాన్‌లో మళ్ళీ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్... గ్రేట్ ఆఫర్స్....

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ యొక్క వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా దీని యొక్క డిస్ప్లే 19: 9 కారక నిష్పత్తి మరియు 320 ppi పిక్సెల్ సాంద్రతతో గల HD + తో ప్యాక్ చేయబడి ఉంటుంది. వాటర్‌డ్రాప్ తరహా నాచ్డ్ డిజైన్‌తో హ్యాండ్‌సెట్ పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తాజా టీజర్ సూచించింది.

శామ్సంగ్ వార్షికోత్సవ సేల్స్....... ఆఫర్స్ అదుర్స్

ర్యామ్

షియోమి ఈ స్మార్ట్‌ఫోన్ ను 3GB ర్యామ్ ఆప్షన్‌లో అందించే అవకాశం ఉంది. కంపెనీ రిలీజ్ చేసిన టీజర్ ప్రకారం రాబోయే రెడ్‌మి హ్యాండ్‌సెట్‌లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 439 SoC ఉంటుంది. ఇది MIUI 10.0.1.3 ఆధారిత ఆండ్రాయిడ్ పైతో రన్ అవుతుందని భావిస్తున్నారు.

రోజుకు 170GB డేటాను బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లలో అందించే ఏకైక టెల్కో BSNL

ఫ్లిప్‌కార్ట్
 

ఫ్లిప్‌కార్ట్ లో లీకైన టీజర్ ప్రకారం ఇది "అల్టిమేట్ స్క్రీన్ ప్రొటెక్షన్" తో వస్తుంది. షియోమి రెడ్‌మి 8 రెడ్ కలర్ ఆప్షన్‌లో అందించే అవకాశం ఉంది. దీని వెనుక భాగంలో ప్లాస్టిక్ లాంటి ముగింపు కోసం వెళ్ళవచ్చు. ఇది వెనుక భాగంలో "ఆరా మిర్రర్ డిజైన్" తో వస్తుంది.

బ్యాటరీ

రెడ్‌మి 8 స్మార్ట్‌ఫోన్ యొక్క బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే ఇది కొత్తగా అప్డేట్ అయిన బ్యాటరీతో వస్తుందని చైనా కంపెనీ ప్రచారం చేస్తోంది. ఇది 4,000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని పుకార్లు వినిపించాయి. ఇటీవల విడుదల చేసిన రెడ్‌మి 8A మాదిరిగానే రెడ్‌మి 8 కూడా భారీ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi 8 launching today in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X