Redmi 8A Dual సేల్స్ నేటి నుంచే... ఆఫర్స్ అదుర్స్...

|

షియోమి యొక్క తాజా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి 8A డ్యూయల్‌ యొక్క మొదటి సేల్స్ ఇండియాలో ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్త రెడ్‌మి 8A డ్యూయల్ యొక్క ఫీచర్స్ అన్ని కూడా ఎక్కువగా రెడ్‌మి 8A ని పోలిఉంటాయ కానీ ఇది సంస్థ యొక్క రెడ్‌మి 8A యొక్క అప్ డేట్ వెర్షన్ గా అందుబాటులో ఉంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

షియోమి రెడ్‌మి 8A డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ ఇండియాలో రెండు వేరియంట్ లలో విడుదల అయింది. ఇందులో 2 జిబి ర్యామ్ + 32 జిబి స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.6,499 వద్ద ఉండగా అలాగే 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ యొక్క ధర రూ.6,999 ల వద్ద ఉన్నది.

 

 

ZEE5 Hypershots: టిక్‌టాక్‌కు పోటీగా కొత్త యాప్ZEE5 Hypershots: టిక్‌టాక్‌కు పోటీగా కొత్త యాప్

లభ్యత

లభ్యత

షియోమి సంస్థ యొక్క కొత్త రెడ్‌మి 8A డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ యొక్క అమ్మకాలు నేటి నుంచి ఆన్‌లైన్ ద్వారా అమెజాన్ ఇండియా మరియు Mi.comలో 12PM నుంచి మొదలు కానుంది. ఇది ప్రారంభించడానికి షియోమి ఆఫ్‌లైన్ Mi స్టోర్ల ద్వారా కూడా అందుబాటులో ఉంటుంది. ఇది సీ బ్లూ, స్కై వైట్ మరియు మిడ్నైట్ గ్రే అనే మూడు కలర్ ఎంపికలలో అందుబాటులో ఉంటుంది.

 

 

Tata Sky క్రొత్త ఛానల్ ప్యాక్‌ల ధరలు ఇవే....Tata Sky క్రొత్త ఛానల్ ప్యాక్‌ల ధరలు ఇవే....

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

రెడ్‌మి 8A డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌లో 19: 9 కారక నిష్పత్తితో 6.22-అంగుళాల డాట్ నాచ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ ప్యానెల్ HD + రిజల్యూషన్ వద్ద పనిచేస్తుంది. దీని యొక్క డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడి ఉంటుంది. సరికొత్త రెడ్‌మి 8A డ్యూయల్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 439 SoCతో ప్యాక్ చేయబడి వస్తుంది.

 

BSNL భారత్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ ఈ రాష్ట్రాలలో ప్రారంభమైంది....BSNL భారత్ ఎయిర్‌ఫైబర్ సర్వీస్‌ ఈ రాష్ట్రాలలో ప్రారంభమైంది....

కెమెరా

కెమెరా

రెడ్‌మి 8A డ్యూయల్‌ స్మార్ట్‌ఫోన్‌ యొక్క కెమెరాల విషయానికొస్తే దీని యొక్క వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ల కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు 8 మెగాపిక్సెల్ AI సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి 8A డ్యూయల్‌లోని ముందు మరియు వెనుక కెమెరాలు రెండు AI పోర్ట్రెయిట్ మోడ్ షాట్‌లను తీయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

బ్యాటరీ

బ్యాటరీ

షియోమి రెడ్‌మి 8A డ్యూయల్ స్మార్ట్‌ఫోన్‌ VoWifi మరియు రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ మద్దతును కలిగి ఉంటుంది. ఇది కొత్త ఆరా ఎక్స్ గ్రిప్ డిజైన్‌ను కలిగి ఉండి మంచి పట్టుతత్వాన్ని కలిగి ఉంటుంది అని కంపెనీ పేర్కొంది.ఈ ఫోన్ 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి USB టైప్-C పోర్ట్ ను కలిగి ఉండి 18W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందిస్తుంది.

 

 

OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్OPPO F15: అద్భుతమైన డిజైన్లతో RS.20,000లోపు రూపొందించిన స్మార్ట్‌ఫోన్

ఓఎస్‌

ఓఎస్‌

రెడ్‌మి 8A డ్యూయల్ హ్యాండ్‌సెట్ డ్యూయల్ సిమ్ కార్డ్ స్లాట్‌లను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన మైక్రో SD కార్డ్ స్లాట్‌ను ఉపయోగించి మెమొరీని 512GB వరకు విస్తరించవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 9 పై ఓఎస్‌తో పని చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ FM రేడియో ఫీచర్‌తో వస్తుంది మరియు p2i కోటింగ్ అంటే స్ప్లాష్ ప్రూఫ్ ను కూడా కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi 8A Dual Sales Start Today: Price, Sales Offers,Specs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X