రూ.10,999 ధరతో రెడ్‌మి 9 పవర్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్!!! ఫీచర్స్ బ్రహ్మాండం
కరోనా మొదలైనప్పటి నుంచి అన్ని సంస్థలు తమ కొత్త ఉత్పత్తులను ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారానే లాంచ్ చేస్తున్నాయి. షియోమి సంస్థ ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా ఈ రోజు రెడ్‌మి 9 పవర్ అనే కొత్త స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో విడుదల చేసింది. రెండు వేరు వేరు వేరియంట్‌లలో లభించే ఫోన్ యొక్క అమ్మకాలు డిసెంబర్ 22 నుండి అమెజాన్ మరియు Mi.కామ్‌లో మొదటిసారి ప్రారంభం కానున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రెడ్‌మి 9 పవర్ స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు
రెడ్‌మి 9 పవర్ కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజ్ బేస్ మోడల్ ధర రూ.10,999 కాగా, 4GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధర 11,999 రూపాయలు. ఈ స్మార్ట్ఫోన్ మైటీ బ్లాక్, బ్లేజింగ్ బ్లూ, ఫైరీ రెడ్ మరియు ఎలక్ట్రిక్ గ్రీన్ వంటి నాలుగు ఫంకీ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ అమెజాన్, Mi.కామ్ మరియు Mi హోమ్ స్టోర్స్ మరియు దేశవ్యాప్తంగా గల ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో డిసెంబర్ 22 నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది.

రెడ్‌మి 9 పవర్ క్వాడ్ రియర్ సెటప్ కెమెరా స్పెసిఫికేషన్స్
రెడ్‌మి 9 పవర్ కొత్త స్మార్ట్‌ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 మద్దతుతో 6.53-అంగుళాల FHD+ పెద్ద డోర్ డ్రాప్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. డిజైన్ పరంగా ఈ ఫోన్ అద్భుతమైన ఆకృతితో పాటుగా వెనుక భాగం శక్తివంతమైన కలర్ లతో అందంగా కనిపిస్తుంది. వెనుక ప్యానెల్‌లో గల పెద్ద రెడ్‌మి లోగో డిజైన్ దీని యొక్క సౌందర్యాన్ని మరింత పెంచుతుంది. కెమెరా సెటప్ కూడా ఫోన్ డిజైన్ లో ప్రీమియంగా కనిపిస్తుంది. కెమెరాల విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో క్వాడ్ రియర్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ ప్యానెల్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్ సెకండరీ కెమెరా, 2MP మాక్రో లెన్స్ మరియు 2MP డెప్త్ సెన్సార్‌లతో జతచేయబడి ఉంటాయి. సెల్ఫీల కోసం ముందుభాగంలో వాటర్‌డ్రాప్ నాచ్ లోపల 8MP షూటర్ కెమెరాను కలిగి ఉంటుంది.

రెడ్‌మి 9 పవర్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్
రెడ్‌మి 9 పవర్ కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ విషయంలో ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662తో ఆడ్రినో 610 GPUతో పాటుగా 4GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 10 ఆధారంగా MIUI 12తో రన్ అవుతుంది. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 కి అప్‌గ్రేడ్ అవుతుంది అని సంస్థ తెలిపింది. ఇతర ముఖ్యమైన ఫీచర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6000mAh పెద్ద బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది రివర్స్ ఛార్జింగ్ కు మద్దతును ఇస్తుంది. అలాగే ఇది USB టైప్-C పోర్ట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ AI ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








