షియోమి నుంచి దేశ్ కా స్మార్ట్‌ఫోన్, తక్కువ ధరకే !

By Hazarath
|

చైనా మొబైల్ దిగ్గజం షియోమి రెడ్‌మి సీరిస్‌లో ఈ నెల 30న సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లో ఈ నెల 30న విడుదల చేయనుంది. కాగా లాంచ్ అయిన తరువాత డిసెంబర్ మొదటి వారం నుంచి ఈ ఫోన్ అమ్మకానికి వెళుతుందని కంపెని తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

 

Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !

 ఈ నెల 30న లాంచ్..

ఈ నెల 30న లాంచ్..

షియోమి కంపెనీ ఈ నెల 30న లాంచ్ చేయనున్న ఫోన్ పేరును కంపెనీ దేశ్ కా స్మార్ట్‌ఫోన్ అంటూ అభివర్ణించింది. షియోమి నుంచి వచ్చిన అన్ని ఫోన్ల కంటే ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరతో మార్కెట్లోకి వస్తుందని సమాచారం.

రెడ్‌మి 5ఏ

రెడ్‌మి 5ఏ

అయితే మరికొన్ని వార్తల ప్రకారం ఈ రెడ్‌మి 5ఏనే దేశ్ కా స్మార్ట్‌ఫోన్ గా రాబోతుందని తెలుస్తోంది. ఈ ఫోన్ ధర కూడా సుమారు రూ.5,800గా ఉండవచ్చని అంచనా..ఇప్పుడు మార్కెట్లో షియోమి ఫోన్లలో అత్యంత తక్కువ ధరకు లభించే ఫోన్ రెడ్‌మి 4ఏ అన్న విషయం అందరికీ తెలిసిందే.

 షియోమీ రెడ్‌మీ 5ఎ ఫీచర్లు
 

షియోమీ రెడ్‌మీ 5ఎ ఫీచర్లు

5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

పలు ఆఫర్లను

పలు ఆఫర్లను

కాగా ఈ ఫోన్ తో పాటు పలు ఆఫర్లను షియోమి ప్రకటించే అవకాశం ఉందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఈ మధ్య కార్బూన్ నుంచి వచ్చిన ఎయిర్‌టెల్ అలాగే ఇతర ఫోన్లకు ఈ ఫోన్ గట్టి పోటీనిస్తుందని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi Desh Ka Smartphone to launch on November 30: Here’s all we know Read more News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X