ఆండ్రాయిడ్ 10 MIUI 11 అప్‌డేట్‌తో షియోమి రెడ్‌మి K20

|

గూగుల్ తన అన్ని రకాల ఫోన్‌ల కోసం ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను విడుదల చేసి కొన్ని నెలలు అయ్యింది. అప్పటి నుండి చాలా ఫోన్‌లు ఈ అప్‌డేట్‌ను పొంది ఆండ్రాయిడ్ యొక్క తాజా వెర్షన్‌తో రన్ అవుతున్నాయి. ఈ ఫోన్‌లలో ఎక్కువ భాగం ప్రీమియం ఫ్లాగ్‌షిప్‌లు మరియు మిడ్‌రేంజ్ మోడళ్లు ఇంకా సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ అప్‌డేట్‌ను పొందలేదు.

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌
 

ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌

షియోమి సంస్థ ఈ సంవత్సరం తన ఫోన్ లకు ఈ ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను పంపిణీ చేయడం మొదలుపెట్టింది. గూగుల్ పిక్సెల్ ఫోన్‌లు ఈ అప్‌డేట్‌ను పొందిన చాలా కాలం తర్వాత ఇప్పుడు షియోమి యొక్క రెడ్‌మి K 20 ప్రో ఫోన్ ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను అందుకుంటున్నది. ఇప్పుడు షియోమి ఈ మోడల్‌కు కొత్త అప్‌డేట్‌ను విడుదల చేయడం ప్రారంభించింది.

Samsung Galaxy Fold 2 : లీక్ అయిన ఫీచర్స్ ఇవే.....

రెడ్‌మి K 20

ఇండియాలో చాలా మంది రెడ్‌మి K 20 స్మార్ట్ ఫోన్ యూజర్లు సరికొత్త సెక్యూరిటీ ప్యాచ్, కొన్ని బగ్ ఫిక్స్ లు మరియు ముఖ్యంగా ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ను తీసుకువచ్చే కొత్త MIUI 11 అప్‌డేట్‌ను స్వీకరించడం ప్రారంభించారు. రెడ్‌మి K20 వినియోగదారుల దాదాపు నాలుగు నెలల సుదీర్ఘ నిరీక్షణ తరువాత చివరకు ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌ అందుబాటులోకి వచ్చింది. ఎప్పటిలాగే ఈ కొత్త అప్‌డేట్‌ ఓవర్-ది-ఎయిర్ (OTA) ద్వారా అందుబాటులోకి వస్తోంది. అందువల్ల అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేయడానికి మీరు Wi-Fi నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వవలసి ఉంటుంది.

Vivo S1 Pro: ఆకర్షణీయమైన ధర వద్ద నేడే మొదటి సేల్ ప్రారంభం...

ఆండ్రాయిడ్ 10
 

ఆండ్రాయిడ్ 10 యొక్క కొత్త అప్‌డేట్‌ 2.2GB స్టోరేజ్ తో విడుదల కావడంతో దీన్ని డౌన్‌లోడ్ చేయడానికి మీ యొక్క స్మార్ట్ ఫోన్ లో దానికి తగినంత స్టోరేజ్ స్పేస్ ఉండవలసిన అవసరం ఎంతో ఉంది. ఆండ్రాయిడ్ 10 అప్‌డేట్‌తో ఫోన్ లో చాలా రకాల మార్పులను తీసుకువస్తుంది. ఈ మార్పులలో రెడ్‌మి కె 20 ఫోన్ పూర్తిగా MIUI 11 చేత కవర్ చేయబడుతుంది. అయితే ప్రైవసీ మరియు లొకేషన్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. OS యొక్క లొకేషన్ మరియు ఇతర పారామితులను యాక్సెస్ చేయడానికి వినియోగదారులు ఇప్పుడు వ్యక్తిగత యాప్ లకు అనుమతి ఇవ్వగలరు.

నూతన సంవత్సరం మొదటి రోజు వాట్సాప్ రికార్డ్ !!!! అది ఏమిటో తెలుసా?

MIUI 11

MIUI 11.0.1 కొత్త అప్‌డేట్‌ ఇటీవలి డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్‌ను కూడా రెడ్‌మి K 20 కి కూడా తెస్తుంది. MIUI 11 కోసం నివేదించబడిన కొన్ని బగ్ లు ఈ అప్‌డేట్‌తో పరిష్కరించబడ్డతాయి. రెండవ స్థానంలో ఉన్నప్పుడు స్క్రోలింగ్ స్క్రీన్షాట్లను తీసుకోవడం మరియు నోటిఫికేషన్ షేడ్ లలో నోటిఫికేషన్ సెట్టింగులను ఓపెన్ చేయడం వంటివి కూడా చేయవచ్చు. ఆండ్రాయిడ్ 10 కొత్త అప్‌డేట్‌ డార్క్ మోడ్ ఫీచర్ మరియు కొత్త సంజ్ఞ నావిగేషన్ సిస్టమ్‌ను కూడా తీసుకువస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi K20 Smartphone Users Start Receiving Android 10 MIUI 11 Update

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more
X