భార‌త్‌లో Redmi K50i మొబైల్ విడుద‌ల రేపే.. లైవ్ స్ట్రీమింగ్ అక్క‌డే!

|

Xiaomi కంపెనీ భార‌త్‌లో K Series మొబైల్స్‌ను మ‌ళ్లీ తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన‌ విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే Redmi K50i మోడ‌ల్‌ను భార‌త మార్కెట్లో విడుద‌ల చేసేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసుకుంది. జులై 20 వ తేదీన‌, బుధ‌వారం మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు నిర్వ‌హించ‌బోయే ఈవెంట్‌లో ఈ మొబైల్‌ను కంపెనీ భార‌త్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఇందుకు సంబంధించిన ఈవెంట్‌ను వ్యూవ‌ర్స్ లైవ్‌ స్ట్రీమింగ్ లో చూడ‌వ‌చ్చు. ఈ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ ను కంపెనీ అధికారిక యూట్యూబ్ ఛానెల్ ద్వారా లేదా సోష‌ల్ మీడియా ద్వారా చూడ‌వ‌చ్చు. కాగా, ఇప్పుడు ఈ మొబైల్‌కు సంబంధించిన లీక్ స్పెసిఫికేష‌న్లు, ఇత‌ర ఫీచ‌ర్ల‌ను గురించి మ‌నం తెలుసుకుందాం.

Xiaomi Redmi K50i launch date i

Redmi K50i లీక్‌డ్ ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.6 అంగుళాల full-HD + LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 144Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ MediaTek Dimensity 8100 (5 nm) ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఓఎస్ స‌హ‌కారంతో ప‌నిచేస్తుంది.

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 64 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్‌(అల్ట్రా వైడ్ లెన్స్‌), 2 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్‌)ని క‌లిగి ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4,400 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది.

Xiaomi Redmi K50i launch date i

తాజాగా లీకైన వివరాల ప్రకారం, Redmi K50i బేస్ మోడల్ ధ‌ర రూ. 24,000 నుండి రూ. 28,000 వరకు ఉండవచ్చని అంచ‌నా వేస్తున్నారు. 8GB/256GB స్టోరేజీ క‌లిగిన త‌దుప‌రి వేరియంట్ రూ. 29,000 నుండి రూ. 33,000 ధర పరిధిలో అందుబాటులో ఉండవచ్చ‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు.

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Redmi Note 10 Pro ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.67 అంగుళాల full-HD +AMOLED డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్Qualcomm SM7150 Snapdragon 732G (8 nm) ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ IP53 వాట‌ర్ లేదా డ‌స్ట్ రెసిస్టాన్స్ రేటింగ్‌ ఫీచ‌ర్తో వ‌స్తోంది. ఇది ఆండ్రాయిడ్ 11 ఓఎస్ స‌హ‌కారంతో ప‌నిచేస్తుంది.

Xiaomi Redmi K50i launch date i

ఈ మొబైల్ నాలుగు కెమెరాల‌ సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 108 మెగాపిక్స‌ల్ క్వాలిటీలో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రో రెండు కెమెరాలు 8 మెగాపిక్సెల్‌(అల్ట్రా వైడ్ లెన్స్‌), 5 మెగాపిక్సెల్ క్వాలిటీ (మాక్రో లెన్స్‌)ని క‌లిగి ఉన్నాయి. ఈ మొబైల్‌కు ఫ్రంట్ సైడ్ వీడియో కాలింగ్ కోసం 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో సెల్ఫీ కెమెరా అందిస్తున్నారు. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5020 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. ఈ మొబైల్ ప్ర‌స్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 20శాతం డిస్కౌంట్‌తో రూ.15,999 ధ‌ర‌కు కొనుగోలుదారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi K50i launch date in India: Price, camera, specs, where to watch livestream

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X