5 నెలల్లో 17 లక్షల ఫోన్‌ల అమ్మకం, భారత్‌లో రెడ్‌మీ నోట్ 3 సంచలనం

|

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్ ల కంపెనీ షియోమీ (Xiaomi),ఐది నెలల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన రెడ్‌మీ నోట్ 3 (Redmi Note 3) స్మార్ట్‌ఫోన్‌ను వినియోగదారులు రికార్డ్ స్థాయిలో కొనుగోలు చేసారు.

 5  నెలల్లో 17 లక్షల ఫోన్‌ల అమ్మకం, రెడ్‌మీ నోట్ 3 సంచలనం

Read More : రూ.4,500కే సామ్‌సంగ్ కొత్త ఫోన్, Jio 4G ఉచితం

ఈ ఫోన్ అమ్మకాల సంఖ్య 17,50,000 మార్కును దాటినట్లు ప్రముఖ రిసెర్చ్ సంస్థ ఐడీసీ తన India Monthly Smartphone Tracker రిపోర్టులో పేర్కొంది. మార్చి 9న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 3.. 2జీబి/3జీబి ర్యామ్, 16జీబి/32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

 5  నెలల్లో 17 లక్షల ఫోన్‌ల అమ్మకం, రెడ్‌మీ నోట్ 3 సంచలనం

Read More : మీ ఫోన్ మీద, మీకెప్పుడైనా కోపం వచ్చిందా..?

2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999. 2014, జూలైలో ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన షియోమీ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ అమ్మకాల విభాగంలో 72% వృద్థిని కనబర్చినట్లు ఐడీసీ నివేదిక వెల్లడించింది.

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్

శక్తివంతమైన బ్యాటరీ బ్యాకప్

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది.

పూర్తి మోటాలిక్ బాడీ

పూర్తి మోటాలిక్ బాడీ

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ పూర్తి మోటాలిక్ ఫినిషింగ్‌తో వస్తోంది. ఈ మెటాలిక్ ఫినిషింగ్ ఫోన్‌కు క్లాసికల్ లుక్‌ను తీసుకువస్తుంది.

శక్తివంతమైన ప్రాసెసర్

శక్తివంతమైన ప్రాసెసర్

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

హైడెఫినిషన్ డిస్‌ప్లే‌

హైడెఫినిషన్ డిస్‌ప్లే‌

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 720x1280 పిక్సల్స్.

శక్తివంతమైన ప్రాసెసర్

శక్తివంతమైన ప్రాసెసర్

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

కెమెరా

కెమెరా

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఇవి హై క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్

ర్యామ్ ఆప్షన్స్ (2జీబి, 3జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి),

 

 

కనెక్టువిటీ ఫీచర్లు

కనెక్టువిటీ ఫీచర్లు

2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఆప్షన్స్‌ను రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచారు.

ఫింగర్ ప్రింట్ స్కానర్

ఫింగర్ ప్రింట్ స్కానర్

షియోమీ సంస్థ విడుదల చేసిన మొదటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ రెడ్‌మీ నోట్ 3 కావటం విశేషం. ఈ స్కానర్ ను సెక్యూరిటీ అవసరాలకు మాత్రమే కాదు సెల్ఫీ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 3 is the highest shipped smartphone in India: IDC. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X