రెడ్మీ నోట్ 3 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

2016లో మార్క్లెట్లో లాంచ్ అయి భారీ స్ధాయిలో అమ్ముడుపోయిన Xiaomi Redmi Note 3 తర్వలో Android 7.1.1 Nougat అప్‌డేట్‌ను అందుకుబోతున్నట్లు సమాచారం. ఈ అప్‌డేట్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారనేది తెలియాల్సి ఉంది.

రెడ్మీ నోట్ 3 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

Read More : ఈ వారం మార్కెట్లో లాంచ్ అయిన కొత్త స్మార్ట్‌ఫోన్‌లు

ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్‌ను అందుకున్న రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు సంబంధించిన వివరాలను తొలత ప్రముఖ బెంచ్ మార్కింగ్ సైట్ GFXBench లీక్ చేసింది. అయితే, ప్రస్తుతానికి ఈ అప్‌‌డేట్ టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితమైన రెడ్మీ నోట్ 3 Android Marshmallow అప్‌డేట్‌ను అందుకున్న విషయం తెలిసిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మెటల్ బాడీ డిజైనింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్

మెటల్ బాడీ డిజైనింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లతో మార్చి 2016లో మార్కెట్లో విడుదలైన షియోమీ రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు ఇండియన్ యూజర్ల నుంచి మంచి స్పందన లభించింది.

రెండు వేరియంట్‌లలో

ఈ ఫోన్‌లను షియోమీ అందుబాటులో ఉంచింది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.9,999. ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. ధర రూ.10,999.

రెడ్మీ నోట్ 3 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

72% వృద్థి..

2014, జూలైలో ఇండియన్ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చిన షియోమీ అప్పటి నుంచి ఇప్పటి వరకు స్మార్ట్ ఫోన్ అమ్మకాల విభాగంలో 72% వృద్థిని కనబర్చినట్లు ఐడీసీ నివేదిక వెల్లడించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 3 to receive Android 7.1.1 Nougat soon. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot