రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

|

ఎడతెరిపిలేని కొత్త ఫోన్ ఆవిష్కరణలతో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ మోత మోగుతోంది. తాజాగా మోటరోలా నుంచి మార్కెట్లో విడుదలైన మోటో జీ4 బడ్జెట్ బ్రాండ్‌లకు కునుకులేకుండా చేస్తోంది. రూ.12,499 ధర ట్యాగ్‌తో లభ్యమవుతున్న ఈ ఫోన్‌ను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

మార్కెట్లో కొద్ది నెలల క్రింత లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు మోటో జీ4 ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచింది. మెటల్ బాడీతో పాటు రెండు ర్యామ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న రెడ్మీ నోట్ 3 ఫోన్ మోటో జీ4 తాకిడిని తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్ల విశ్లేషణను ఇప్పుడు చూద్దాం...

Read More : భలే ఉద్యోగం.. 6 నెలల సెలవు, జీతం కటింగ్ ఉండదు!

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్‌సీడీ డిస్‌‍ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్, 401 పీపీఐ)తో వస్తుండగా రెడ్మీ నోట్ 3 ఫోన్ కూడా అదే డిస్‌ప్లేతో లభ్యమవుతోంది

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్.. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 617 చిప్‌సెట్‌ విత్ అడ్రినో 405 జీపీయూతో వస్తుండగా, రెడ్మీ నోట్ 3.. హెక్సా కోర్ స్నాప్‌డ్రాగన్ 617 చిప్‌సెట్‌ విత్ అడ్రినో 510 జీపీయూతో బిల్ట్ అయ్యింది.

 

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి.. మోటో జీ4, 2జీబి ర్యామ్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

రెడ్మీ నోట్ 3, రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో లభ్యమవుతుండగా, రెండవ వేరియంట్ 3జీబి, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్‌తో దొరుకుతుంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ పోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం.

 

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్.. 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్/2.0 అపెర్చుర్) అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలతో వస్తోంది.

రెడ్మీ నోట్ 3 విషయానికొచ్చేసరికి 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఫోన్ లో చూడొచ్చు. డ్యుయల్ టోన్ ఎల్ఈడి ఫ్లాష్, 1080 పిక్సల్ వీడియో రికార్డింగ్ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి.

 

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్.. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుండగా, షియోమీ రెడ్మీ నోట్ 3 ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

4జీ విత్ వోఎల్టీఈ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్ వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఆఫ్షన్‌లను ఈ ఫోన్‌లు కలిగి ఉన్నాయి.

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

8.65 మిల్లీ మీటర్ల మందంతో వస్తున్న రెడ్మీ నోట్ 3 ఫోన్ 164 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. 7.9 మిల్లీమీటర్ల మందంతో వస్తున్న మోటో జీ4 157 గ్రాముల బరువును కలిగి ఉంటుంది.

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

మోటో జీ4 స్మార్ట్‌ఫోన్.., టర్బో ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తుండగా, రెడ్మీ నోట్ 3 ఫోన్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో కూడిన 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది.

 

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3 vs మోటో జీ4

రెడ్మీ నోట్ 3, 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉండగా, 3జీబి వేరియంట్ ధర రూ.11,999గా ఉంది. అమెజాన్ ఇండియా ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది. మరోవైపు మోటో జీ4 రూ.12,499 ధర ట్యాగ్‌తో అమెజాన్ ఇండియా‌లో ట్రేడ్ అవుతోంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 3 vs Moto G4: Which Mid-Ranger is Your Choice. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X