చేతిలో పేలిపోయిన Redmi Note 4 (వైరల్ వీడియో)

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 7 ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటోన్న స్మార్ట్‌ఫోన్ ప్రపంచాన్ని మరో షాకింగ్ న్యూస్ కలవరపెడుతోంది. భారత్, చైనా వంటి ప్రముఖ స్మార్ట్ ఫోన్ మార్కెట్లలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోన్న షియోమీ రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ కస్టమర్ చేతిలోనే పేలిపోవటం సంచలనం రేకెత్తిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

బెంగుళూరులోని ఓ స్మార్ట్‌ఫోన్ స్టోర్‌లో

ఈ ప్రమాదకర ఘటన బెంగుళూరులోని ఓ స్మార్ట్‌ఫోన్ స్టోర్‌లో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కాబడిన ఈ ఘటన మొత్తం సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది.

సిమ్ ఇన్సర్ట్ చేస్తున్న సమయంలో మంటలు..

ఈ ఘటనకు సంబంధించి టెక్‌కేస్ అనే వెబ్‌సైట్ పోస్ట్ చేసిన కథనం ప్రకారం బెంగుళూరుకు చెందిన అర్జున్ రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసారు. ఆ ఫోన్‌లో సిమ్‌లను ఇన్సర్ట్ చేయించేందుకు ఓ స్మార్ట్‌ఫోన్ స్టోర్ వద్దకు వెళ్లారు, సరిగ్గా సిమ్ ఇన్సర్ట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫోన్ నుంచి మంటలు వ్యాపించాయి.

యూట్యూబ్‌‌లో హల్‌చల్

గతంలోనూ అనేక షియోమి స్మార్ట్‌ఫోన్‌లు అనుమానాస్పద రీతిలో మంటల్లో చిక్కుకోవటం మనం చూసాం. ఫోన్‌రాడర్ అనే ప్రముఖ వెబ్‌సైట్ తొలత ఈ వీడియోను యూట్యూబ్‌‌లో అప్‌లోడ్ చేసింది. బ్లాస్ట్ మొత్తం ఈ వీడియోలో క్లియర్‌గా రికార్డ్ అయ్యింది.  ఈ వీడియోను షియోమి ఇండియా పరిశీలించిదా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

మూడు ర్యామ్ వేరియంట్లలో..

షియోమ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో విక్రయిస్తోంది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 4 explosion caught on video: Report. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot