నిమిషాల్లో సేల్ ముగిసింది, రెడ్మీ నోట్ 4 సంచలనం

సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ సేల్ రెప్ప పాటులో ముగిసింది.

|

రెడ్మీ నోట్ 4 మొదటి ఓపెన్ సేల్ నిమిషాల వ్యవధిలో ముగిసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన ఈ ఓపెన్ సేల్ 10 నిమిషాల్లో ముగిసింది. ఈ ఫోన్‌లను కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో యూజర్లు ఎగబడినట్లు సమాచారం. షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999. డార్క్ గ్రే, బ్లాక్ ఇంకా గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉండే రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి.

 

సెకన్లలో సేల్ ముగిసింది,  రెడ్మీ నోట్ 4 సంచలనం

రెడ్మీ నోట్ 4 స్పెక్స్ 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్. రెడ్మీ నోట్ 4కు పోటీగా మార్కెట్లో సిద్ధంగా ఉన్న 5 స్మార్ట్‌ఫోన్‌లు..

LeEco Le 2

LeEco Le 2

లీఇకో లీ2
5.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ 1080 పిక్సల్ ఇన్‌సెల్ డిస్‌ప్లే, 1.8గిగాహెర్ట్జ్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్ విత్ స్నాప్‌‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన ఈయూఐ 5.8 ఇంటర్‌ఫేస్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (డ్యుయల్ టోన్ ఎల్ఈడి ప్లాష్, ఫేస్ డిటెక్షన్ ఆటోఫోకస్, ఎఫ్/2.0 అపెర్చర్ వంటి ప్రత్యేకతలతో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ( ఎఫ్/2.0 అపెర్చర్, 76.5 డిగ్రీ వైడ్ యాంగిల్ లెన్స్ సౌకర్యంతో), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ, 4జీ ఎల్టీఈ కనెక్టువటీ, యూఎస్బీ టైప్ సీ, సీడీఎల్ఏ టైప్ సీ ఇయరో ఫోన్స్ సపర్ట్.

 Coolpad Cool 1
 

Coolpad Cool 1

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోన్న ఈ ఫోన్ 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండటం విశేషం. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్స్... ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 652 చిప్‌సెట్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్, 13 మెగా పిక్సల్ డ్యుయల్ కెమెరా సెటప్(4కే క్వాలిటీ వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన LeEco EUI పై ఫోన్ రన్ అవుతుంది. 4000mAh బ్యాటరీ, 4జీ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

 Moto G4 Plus

Moto G4 Plus

మోటో జీ4 ప్లస్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది.ఇక రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీతో లభ్యమవుతోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 1.5 గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 617 సీపీయూతో వస్తున్నాయి. ర్యామ్ ఇంకా స్టోరేజ్ అంశాలను పరిశీలించినట్లయితే.. మోటో జీ4 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోంది. మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. మోటో జీ4, జీ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు డ్యుయల్ సిమ్ స్టాండ్ బై ఆన్ 4జీ అండ్ 3జీ, VoLTE,వై-ఫై, బ్లుటూత్ 4.1, 3.5 ఎమ్ఎమ్ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో వంటి స్టాండర్డ్ కనెక్టువిటీ ఫీచర్లను పొందుపరిచారు.

Coolpad Note 5

Coolpad Note 5

కూల్‌ప్యాడ్ నోట్ 5

4జీబి ర్యామ్, 4జీ VoLTE సపోర్ట్, ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4010 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ కెమెరా వంటి శక్తివంతమైన స్పెసిఫికేషన్‌లతో వస్తోన్న ఈ ఫోన్ ధర కేవలం రూ.10,999 మాత్రమే. కూల్‌ప్యాడ్ Note 5 ఫోన్‌లో సెక్యూరిటీకి మరింత ప్రాధాన్యత కల్పిస్తూ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఫీచర్‌ను ఏర్పాటు చేసారు. ఆధునిక సాఫ్ట్‌వేర్ పై స్పందించే ఈ స్కానర్ ద్వారా కేవలం 0.5 సెకన్ల వ్యవధిలో ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. కూల్‌ప్యాడ్ Note 5 డ్యుయల్ స్పేస్ సిస్టం సపోర్ట్‌తో వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్ రెండు వేరువేరు అకౌంట్‌లను ఫోన్‌లో నిర్వహించుకోచ్చు. వాట్సాప్, ఫేస్‌బుక్, మెసెంజర్ వంటి యాప్స్‌ను రెండేసి చప్పున మెయింటేన్ చేయవచ్చు.

 

Lenovo Z2 Plus

Lenovo Z2 Plus

లెనోవో జెడ్ 2 ప్లస్

5- ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిజైన్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), 3 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు :), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా(ప్రత్యేకతలు: f/2.2 aperture, PDAF, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎల్ఈడి ఫ్లాస్, 4కే వీడియో రికార్డింగ్, స్లో మోషన్ 720 పిక్సల్ క్వాలిటీ వీడియో రికార్డింగ్), 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: f/2.2 aperture, 80 డిగ్రీల వైడ్ యాంగిల్ లెన్స్), 3,500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జ్ 3.0 టెక్నాలజీ, డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్స్, 4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 goes out of stock on Flipkart in just 2 seconds. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X