రికార్డుల రెడ్‌మి నోట్ 4 ధర తగ్గింది, ఇకపై ఇదే పర్మినెంట్ ధర !

Written By:

హాట్ కేకుల్లా అమ్ముడుబోతున్న చైనా దిగ్గజం షియోమి రెడ్‌మి నోట్ 4 ధర తగ్గింది. ఇక పర్మినెంట్ గా ఈ తగ్గిన ధర అందుబాటులో ఉంటుందని షియోమి కంపెనీ తెలిపింది. ఇండియాలో 3జిబి ర్యామ్, 32జిబి రోమ్ ధర 10,999గా ఉంది. అయితే ఇప్పుడు ఇది రూ. 1000 తగ్గి 9,999కి అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ధరను పూర్తిగా తగ్గించామంటూ షియోమి ఇండియా హెడ్ మనుకుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్లో ప్రకటించారు.

అమ్మకానికి రెడీగా షియోమి ఎంఐ మిక్స్ 2!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఫ్లిప్‌కార్ట్‌లోనూ అలాగే మి. కామ్‌లోనూ

తగ్గిన ధర ఇకపై ఫ్లిప్‌కార్ట్‌లోనూ అలాగే మి. కామ్‌లోనూ అందుబాటులో ఉంటుంది. కాగా 4జిబి ర్యామ్, 64 జిబి వేరియంట్ ధరను మాత్రం కంపెనీ తగ్గించలేదు. దాని ధర రూ.11,999గానే ఉంది.

తగ్గిన ఈ ధరతో

తగ్గిన ఈ ధరతో ఈ ఫోన్ Moto G5, Nokia 5, Samsung Galaxy J7, Redmi Note 4 aలకు పూర్తి స్థాయిలో పోటీనిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే ఇది ఇప్పటికీ అమ్మకాల్లో సునామిలా పరుగులు పెడుతున్న సంగతి తెలిసిందే.

రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, 4100 mAh బ్యాటరీ, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

ఫోన్ బ్యాటరీ పేలిపోయిందంటూ..

ఈ ఫోన్ బ్యాటరీ పేలిపోయిందంటూ కొన్ని వార్తలు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన కిరణ్ సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్ పై తన దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చిన విషయం విదితమే.

స్పందించిన షియోమీ..

ఘటన పై స్పందించిన షియోమీ తమకు కస్టమర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని, పేలుడుకు సంబంధించి లోతైన దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపింది. తమ బ్రాండ్‌కు సంబంధించిన ప్రతి వస్తువు అన్ని రకాలు క్వాలిటీ పరీక్షలు పాస్ అయిన తరువాతనే మార్కెట్లోకి వెళుతుందని షియోమీ తెలిపింది.

Redmi 4 స్పెసిఫికేషన్స్...

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ప్రివ్యూ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4100mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 4 India Price Cut more News at Gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot