జనవరి 19న రెడ్మీ నోట్ 4

షియోమీ నుంచి 2016లో లాంచ్ అయిన రెడ్మీ నోట్ 3 ఫోన్ ఎంత పెద్ద హిట్ట అయ్యిందో మనందరికి తెలుసు. తాజాగా ఆ ఫోన్‌కు సక్సెసర్ వర్షన్‌గా రెడ్మీ నోట్ 4ను మరికొద్ది రోజుల్లో షియోమీ రంగంలోకి దింపబోతోంది.

జనవరి 19న రెడ్మీ నోట్ 4

Read More : నోకియా 6 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో 5 ఆసక్తికర ఫీచర్లు

జనవరి 19న న్యూఢిల్లో నిర్వహించే స్పెషల్ ఈవెంట్‌లో షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ తో రాబోతోన్న ఈ ఫోన్ మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుందని సమాచారం. మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మూడవ వేరియంట్ 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్.

జనవరి 19న రెడ్మీ నోట్ 4

Read More : ఇది జియో సునామీ.. ఒక్క నెలలో 1.96 కోట్ల యూజర్లు

రెడ్మీ నోట్ 4 ఇతర స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1920 x 1080 పిక్సల్స్), 2.0 GHz ఆక్టా‌కోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం, 4100 mAh బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విజయవంతంగా అమ్ముడుపోతోంది

2016, మార్చి 9న ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన రెడ్‌మీ నోట్ 3 ఫోన్ .. 2జీబి/3జీబి ర్యామ్, 16జీబి/32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లలో విజయవంతంగా అమ్ముడుపోతోంది.

అత్యధికంగా అమ్ముడుపోయిన ఫోన్

2016కు భారత్ లో అత్యధికంగా అమ్ముడుపోయిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో రెడ్మీ నోట్ 3 ఫోన్ ప్రముఖ స్ధానంలో నిలిచింది. మార్కెట్లో 2జీబి ర్యామ్ వేరియంట్ రెడ్మీ నోట్ 3 ధర రూ.9,999. 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999.

శక్తివంతమైన బ్యాటరీ, మెటాలిక్ ఫినిషింగ్..

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. బ్యాటరీ బ్యాకప్ బాగుంటుంది. మెటాలిక్ ఫినిషింగ్ ఫోన్‌కు క్లాసికల్ లుక్‌ను తీసుకువస్తుంది.

ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచిన 64 బిట్ ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 616 ప్రాసెసర్ వేగవంతమైన మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌

రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల మెరుగైన హైడెఫినిషన్ డిస్‌ప్లే‌తో వస్తోంది. రిసల్యూషన్ సామర్థ్యం 720x1280 పిక్సల్స్.  రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను పొందుపరిచారు. ఇవి హై క్వాలిటీ ఫోటోగ్రఫీని చేరువచేస్తాయి.

ఫింగర్ ప్రింట్ సెన్సార్

2జీ, 3జీ, 4జీ , వై-ఫై, బ్లుటూత్, యూఎస్బీ 2.0 వంటి కనెక్టువిటీ ఆప్షన్స్‌ను రెడ్మీ నోట్ 3 స్మార్ట్‌ఫోన్‌‌లో పొందుపరిచారు. షియోమీ సంస్థ విడుదల చేసిన మొదటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ రెడ్‌మీ నోట్ 3 కావటం విశేషం. ఈ స్కానర్ ను సెక్యూరిటీ అవసరాలకు మాత్రమే కాదు సెల్ఫీ అవసరాలకు కూడా ఉపయోగించుకోవచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 4 to launch in India on January 19. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot