ఎక్స్‌టర్నల్ ఫోర్స్ వల్లే రెడ్‌మి నోట్ 4 పేలిపోయింది

గతవారం సంచలనం రేపిన రెడ్‌మి నోట్ 4 పేలుడు ఘటనకు సంబంధించి ప్రాధమిక దర్యాప్తు వివరాలను షియోమి శుక్రవారం రివీల్ చేసింది. 'తీవ్రమైన బాహ్య శక్తి' (Extreme External Force) ఫోన్ పై అప్లై అవటం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుని ఉండొచ్చని షియోమి వెల్లడించింది.

Read More : మీ ఆధార్ కార్డుతో లింకైన మొబైల్ నెంబర్‌ను తెలుసుకోవటం ఎలా?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఘటన తమ దృష్టికి వచ్చిన అనంతరం

ఫోన్ నుంచి మంటల వ్యాపించిన ఘటన తమ దృష్టికి వచ్చిన అనంతరం సదరు కస్టమర్‌తో సంప్రదింపులు జరిపి అతని వద్ద నుంచి రెడ్‌మి నోట్ 4 యూనిట్‌ను దర్యాప్తు నిమిత్తం తీసుకున్నామని షియోమి తెలిపింది.

మొదటి ఇంప్రెషన్స్‌ను పరిశీలించిన తరువాత..

డ్యామేజీకి గురైన డివైస్‌కు సంబంధించి మొదటి ఇంప్రెషన్స్‌ను పరిశీలించినట్లయితే ఫోన్ బ్యాక్ కవర్ అలానే బ్యాటరీలు బెండ్ అయి ఉన్నాయని, ఇదే సమయంలో స్ర్కీన్ కూడా డ్యామేజ్ అయి ఉందని, మొత్తం దర్యాప్తు పూర్తయిన తరువాతనే పేలుడుకు సంబంధించిన ఖచ్చితమైన కారణం తెలిసే అవకాశముందని షియోమి తెలిపింది.

ఘటన పూర్వాపరాలు..

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మరోసారి పరిశీలించినట్లయితే.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన కిరణ్ సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్ పై తన దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి. కిరణ్ ప్యాంట్ జేబు నుంచి వ్యాపిస్తోన్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్‌మి నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్‌ తెలిపారు. కొత్త నోట్‌-4 ఫోన్‌ కాలిపోవడమే కాకుండా ఆ మంటల వల్ల తనకు గాయాలయ్యాయని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.

షియోమి ఏం చెప్పిందంటే..?

ఈ ఘటన పై స్పందించిన షియోమీ తమకు కస్టమర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని, పేలుడుకు సంబంధించి లోతైన దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపింది. తమ బ్రాండ్‌కు సంబంధించిన ప్రతి వస్తువు అన్ని రకాలు క్వాలిటీ పరీక్షలు పాస్ అయిన తరువాతనే మార్కెట్లోకి వెళుతుందని షియోమీ తెలిపింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 4 May Have Exploded Due to 'Extreme External Force', Company Finds. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot