Just In
- 12 hrs ago రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- 13 hrs ago Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- 14 hrs ago ధర రూ.1799 కే, Youtube ,UPI ఫీచర్లతో Itel కొత్త ఫీచర్ ఫోన్! సేల్ వివరాలు
- 15 hrs ago ఎయిర్ కండిషనర్ (AC) ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
Don't Miss
- Movies Guppedantha Manasu April 20th: మహేంద్రపై మను ఫైర్.. దత్తత జరిగేనా.. ఈరోజుటి ఎపిసోడ్లో ఏం జరిగిందంటే?
- News మహానదిలో పడవ మునక: ఏడుమంది గల్లంతు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
రెడ్మీ నోట్ 4 కోసం చూస్తున్నారా..?
5 రోజుల్లోపు ఫోన్ డెలివరీ...
రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా?, మీకో గుడ్ న్యూస్. నిన్న, మొన్నటి వరకు ఫ్లాష్ సేల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న రెడ్మీ నోట్ 4 హ్యాండ్సెట్లు త్వరలోనే ఆన్లైన్ ప్రీ-ఆర్డర్స్ పై లభ్యంకాబోతున్నాయి. తన సొంత వెబ్సైట్ అయిన Mi.com ద్వారా మార్చి 31, మధ్యాహ్నం 12 గంటల నుంచి రెడ్మీ నోట్ 4 ఆన్లైన్ ప్రీ-ఆర్డర్స్‌ను స్వీకరిస్తున్నట్లు షియోమీ ఇండియా తెలిపింది.
Read More : మోటో జీ5 వచ్చేస్తోంది, రూ.10,000కే?
5 రోజుల్లోపు ఫోన్ డెలివరీ
ఈ సైట్ ద్వారా రెడ్మీ నోట్ 4 ఫోన్‌ను బుక్ చేసుకునే యూజర్‌కు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉందు. ఆన్లైన్ పేమెంట్ సిస్టం ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన 5 రోజుల్లోపు ఫోన్ డెలివరీ అవుతుందని షియోమీ తెలిపింది. మరోవైపు ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్ లను విక్రయిస్తోంది. భారత్ లో రెడ్మీ నోట్ 4 అమ్మకాలు 10 లక్షల మార్క్ ను క్రాస్ చేసినట్లు సమచారం.
రెడ్మీ నోట్ 4 డిజైనింగ్ పరంగా చూస్తే
డిజైనింగ్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3, రెడ్మీ నోట్ 4లు మొదటి చూపులో ఒకేలా అనిపిస్తాయి. నోట్ 3 తరహాలోనే నోట్ 4 కూడా 5.5 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. అదనంగా ఈ ఫోన్ డిస్ప్లే పై 2.5డి కర్వుడ్ గ్లాస్‌ను షియోమీ పొందుపరిచింది. రెడ్మీ నోట్ 3లో కర్వుడ్ గ్లాస్ ఉండదు. నోట్3 మాదిరిగానే నోట్ 4 కూడా సమానమైన స్ర్కీన్ రిసల్యూషన్ (1080*1920)ను కలిగి ఉంది. పీపీఐ (పిక్సల్స్ పర్ ఇంచ్) విషయానికి వచ్చేసరికి నోట్ 4 ఫోన్ 403 పీపీఐను కలిగి ఉంటుంది.
క్యాండీ బార్ డిజైన్
రెడ్మీ నోట్ 4 ఫోన్ క్యాండీ బార్ డిజైన్‌తో వస్తోంది. యునిమెటల్ బాడీ డిజైన్‌తో ఇటీవల మార్కెట్లోకి వస్తోన్న చాలా వరకు ఫోన్లలో ఈ తరహా డిజైన్‌ను మీరు చూడొచ్చు. రెడ్మీ నోట్ 4 ఫోన్ అంచులు మరింత గుండ్రంగా అనిపిస్తాయి. బరువు విషయానికి వచ్చేసరికి
రెడ్మీ నోట్ 4 ఫోన్ ను 174 గ్రాముల బరువుతో తీర్చిదిద్దారు.
రెడ్మీ నోట్ 4 హర్డ్‌వేర్ బటన్స్
హర్డ్‌వేర్ బటన్స్ వచ్చేసరికి వాల్యుమ్ రాకర్స్ అలానే పవర్ బటన్లను ఫోన్‌కు కుడి వైపు ఏర్పాటు చేసారు. హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్‌ను ఫోన్‌కు ఎడమ వైపు ఏర్పాటు చేయటం జరిగింది. ఫోన్ క్రింద భాగంలో రెండు స్పీకర్స్‌తో పాటు ఒక మైక్రోయూఎస్బీ పోర్టును అమర్చటం జరిగింది. టీవీ, ఏసీ వంటి డివైస్‌లకు ఈ ఫోన్‌ను రిమోట్ కంట్రోలర్‌లా ఉపయోగించుకునేందుకు వీలుగా పై భాగంలో IR blasterను ఏర్పాటు చేసారు. 3.5mm హెడ్‌ఫోన్ జాక్ కూడా ఫోన్ పై భాగంలోనే ఉంటుంది. ఇదే సమయలో ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను ఫోన్ వెనుక భాగంలో 13 మెగా పిక్సల్ కెమెరా మాడ్యుల్ క్రింద అమర్చారు.
బెస్ట్ సామ్సంగ్ స్మార్ట్ఫోన్లు (రూ.25,000లోపు)
హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్
ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్‌తో పాటు 2.5డి కర్వుడ్ గ్లాస్ రెడ్మీ నోట్ 4 ఫోన్‌కు ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుంది. రెడ్మీ నోట్ 4 ఆఫర్ చేసే 5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్ప్లే, డీసెంట్ వ్యూవింగ్ యాంగిల్స్‌తో పాటు నేచురల్ కలర్స్‌ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఎండ వాతవరణంలో ఫోన్లోని టెక్స్ట్‌ను చదవటం కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తోంది. రిఫ్లెక్టివ్ ప్యానల్ కారణంగా ఇలా జరుగుతుండొచ్చు.
ర్యామ్ ఇంకా స్టోరేజ్
ర్యామ్ ఇంకా స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.
ఈ వారం విడుదలైన కొత్త స్మార్ట్ఫోన్లు
Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్
Qualcomm Snapdragon 625 ఆక్టా కోర్ ప్రాసెసర్ పై ఫోన్ రన్ అవుతుంది. 14nm తయారీ ప్రాసెస్ ఆధారంగా ఈ చిప్‌సెట్‌ను అభివృద్ది చేసారు. ఇటీవల మార్కెట్లో లాంచ్ అయిన లెనోవో పీ2 స్మార్ట్‌ఫోన్‌లో కూడా ఇదే తరహా చిప్‌సెట్‌ను ఉపయోగించటం జరిగింది. Adreno 506 GPU ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది.
వేగవంతమైన మల్టీటాస్కింగ్
గిజ్బాట్ బృందం పరిశీలించిన 4జీబి ర్యామ్ వేరియంట్ చాలా స్మూత్‌గా పనిచేస్తోంది. యాప్స్ మధ్య మల్టీటాస్కింగ్ బాగుంది. 20 నిమిషాలు పాటు గేమ్స్ ఆడినప్పటికి హీటింగ్ కనిపించలేదు. కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 ఫోన్ 4జీ విత్ VoLTE సపోర్ట్‌తో వస్తోంది. కాబట్టి నిశ్చింతగతా జియో సిమ్‌ను వాడుకోవచ్చు.
ఈ ఫోన్ పై రెండు సంవత్సరాల వారంటీ
సాఫ్ట్వేర్ విషయానికి వచ్చేసరికి
రెడ్మీ నోట్ 4, Android 6.0.1 Marshmallow ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా డిజైన్ చేసిన MIUI 8 ప్లాట్‌ఫామ్ పై రన్ అవుతుంది. ఈ ప్లాట్‌ఫామ్ కలర్‌ఫుల్ యూజర్ ఇంటర్ఫేస్తో ఆకట్టుకుంటోన్న విషయం తెలిసిందే. షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్ కోసం సెకండ్ స్పేస్ ఫీచర్‌ను అభివృద్ధి చేసింది. ఈ ఫీచర్ ద్వారా ఫోన్లో రెండేసి చొప్పున వాట్సాప్, హైక్ వంటి యాప్స్‌ను రన్ చేసుకోవచ్చు
ప్రైమరీ కెమెరా విషయానికి వచ్చేసరికి..
రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. f/2.0 aperture, డ్యుయల్ టోన్ ఫ్లాష్ లైట్ వంటి ఫీచర్లను ఈ కెమెరా కలిగి ఉంది. నోట్ 3 ప్రైమరీ కెమెరాతో పోలిస్తే నోట్ 4 కెమెరా బాగున్నప్పటికి కాంట్రాస్ట్ లెవల్స్ అంతగా గొప్పగా లేవు. డేలైట్ కండీషన్ లో ఈ కెమెరాతో చిత్రీకరించిన పలు ఫోటోలు ఓవర్ గా ఎక్స్ పోజ్ అవ్వటమే ఇందుకు కారణం. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లోపించటం, తక్కువ స్ధాయిలో లైట్నిగ్ పనితీరు వంటి అంశాలు రెడ్మీ నోట్ 4 కెమెరాను ప్రధాన అవరోధంగా నిలిచాయి.
ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చేసరికి
రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్ 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. మంచి లైటింగ్ కండీషన్లలో ఈ కెమెరా అద్బుతంగా పనిచేస్తోంది. ఇవి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పోస్ట్ చేయడానికి చాలా బాగుంటాయి.
బ్యాటరీ కెపాసిటీ..
బ్యాటరీ కెపాసిటీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్, 4100mAh బ్యాటరీ కెపాసిటీతో వస్తోంది. జాగ్రత్తగా వాడుకుంటే రెండు రోజుల పాటు ఈ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఫోన్ హెవీగా వాడటం మొదలు పెడితే ఒక్క రోజులోనే బ్యాటరీ మొత్తం దిగిపోతుంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470