Redmi Note 4 బుకింగ్స్ ప్రారంభం

షియోమీ రెడ్మీ నోట్ 4 మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్..

|

నిన్న, మొన్నటి వరకు ఫ్లాష్‌సేల్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉన్న రెడ్మీ నోట్ 4 హ్యాండ్‌సెట్‌లు ఇప్పుడు ప్రీ-ఆర్డర్స్ పై లభ్యమవుతున్నాయి. షియోమీ సొంత ఈ-కామర్స్ వెబ్‌సైట్ అయిన Mi.com నేటి మధ్యాహ్నం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెడ్మీ నోట్ 4 ఆన్‌లైన్ ప్రీ-ఆర్డర్స్‌ను స్వీకరిస్తోంది.

Read More : ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండదు..

క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం ఉండదు..

Mi.com ద్వారా రెడ్మీ నోట్ 4 ఫోన్‌ను బుక్ చేసుకునే యూజర్‌కు క్యాష్ ఆన్ డెలివరీ సదుపాయం అందుబాటులో ఉండదు. ఆన్‌లైన్ పేమెంట్ సిస్టం ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన 5 రోజుల్లోపు ఫోన్ డెలివరీ అవుతుందని షియోమీ తెలిపింది.

ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ విక్రయాలు..

ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ విక్రయాలు..

ఆఫ్‌లైన్ మార్కెట్లోనూ షియోమీ తన రెడ్మీ నోట్ 4 ఫోన్ లను విక్రయిస్తోంది. భారత్ లో రెడ్మీ నోట్ 4 అమ్మకాలు 10 లక్షల మార్క్ ను క్రాస్ చేసినట్లు సమచారం.

మూడు ర్యామ్ వేరియంట్లలో..

మూడు ర్యామ్ వేరియంట్లలో..

షియోమీ ఇండియా తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లను మూడు ర్యామ్ వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. 2జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. 3జీబి ర్యామ్ + 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999. 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,999.

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్).

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్

4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 pre-orders started. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X