రెడ్‌మి నోట్ 4 ఎలా పేలింది..? దర్యాప్తుకు ఆదేశించిన షియోమి

రెడ్‌మి నోట్ 4 ప్యాంట్ జేబులో పేలుడుకు గురైన సంఘటనను సీరియస్‌గా తీసుకున్న కంపెనీ షియోమి దర్యాప్తుకు ఆదేశించింది. రెడ్‌మి నోట్ 4 బ్లాస్ట్ అయ్యిందంటూ ఫోటోలతో కూడిన ఓ పోస్ట్ గతవారం సోషల్ మీడియాలో సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Read More : రిలయన్స్ సైలెంట్‌గా మరో ఫోన్‌ను లాంచ్ చేసింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జేబులోనే పేలిపోయింది..

ఈ ఘటనకు సంబంధించి స్థానిక మీడియా ప్రచురించిన కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన కిరణ్ సెల్‌ఫోన్ ప్యాంట్ జేబులో పెట్టుకుని మోటార్ సైకిల్ పై తన దుకాణానికి వెళ్తుండగా.. అది ఒక్కసారిగా కాలిపోయి జేబులో నుంచి మంటలు వచ్చాయి.

కన్స్యూమర్ కోర్టును ఆశ్రయిస్తానంటున్న కిరణ్

కిరణ్ ప్యాంట్ జేబు నుంచి వ్యాపిస్తోన్న మంటలను గమనించిన స్థానికులు వెంటనే నీళ్లు చల్లి మంటలు ఆర్పి ఫోన్‌ను కింద పడేశారు. ఈ సంఘటనలో కిరణ్ తొడ భాగంలో గాయాలయ్యాయి. ఇరవై రోజుల క్రితమే కొనుగోలు చేసిన రెడ్‌మి నోట్-4 ఫోన్ ఇలా కాలిపోయిందని కిరణ్‌ తెలిపారు. కొత్త నోట్‌-4 ఫోన్‌ కాలిపోవడమే కాకుండా ఆ మంటల వల్ల తనకు గాయాలయ్యాయని, దీనిపై కోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు.

దర్యాప్తుకు ఆదేశించిన షియోమీ..

ఈ ఘటన పై స్పందించిన షియోమీ ప్రమాదానికి గురైన కస్టమర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని, తమకు కస్టమర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమని, పేలుడుకు సంబంధించి లోతైన దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలిపింది. తమ బ్రాండ్‌కు సంబంధించిన ప్రతి వస్తువు అన్ని రకాలు క్వాలిటీ పరీక్షలు పాస్ అయిన తరువాతనే మార్కెట్లోకి వెళుతుందని షియోమీ తెలిపింది.

6 నెలల్లో 50లక్షల యూనిట్లు

2017కు గాను బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన రెడ్‌మి నోట్ 4 అమ్మకాల పరంగా అరుదైన రికార్డును నెలకొల్పింది. ఈ ఫోన్ లాంచ్ అయిన 6 నెలల వ్యవధిలోనే 50లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సంస్థ షియోమి మేనేజింగ్ డైరెక్టర్ మను కుమార్ జెయిన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రకటించారు. కౌంటర్ పాయింట్ రిసెర్చ్ ప్రకారం 2017 మొదటి క్వార్టర్ కుగాను అత్యధికంగా అమ్ముడుపోయినా ఫోన్ గానూ రెడ్‌మి నోట్ 4 రికార్డు నెలకొల్పిన విషయం తెలిసిందే.

మూడు వేరియంట్‌లలో ఫోన్ లభ్యం...

మూడు వేరియంట్‌లలో.. రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. వాటి వివరాలు.. 2జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ (ధర రూ.9,999), 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ (రూ.10,999), 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ (ధర రూ.12,999). ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 4 Reportedly Explodes in Pocket, Company Launches Investigation. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot