రెడ్మీ నోట్ 3 సక్సెస్‌తో దూసుకొస్తున్న రెడ్మీ నోట్ 4

రెడ్మీ నోట్ 3, రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ సక్సెస్ నేపథ్యంలో ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ తన రెడ్మీ నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నహాలు చేస్తోంది.

రెడ్మీ నోట్ 3 సక్సెస్‌తో దూసుకొస్తున్న రెడ్మీ నోట్ 4

Read More : కికాస్ టొరెంట్స్ మళ్లీ వచ్చేసింది...

లేటెస్ట్ రూమర్స్ ప్రకారం.. రెడ్మీ నోట్ 4 ఫోన్ వచ్చే జనవరిలోనే ఇండియన్ మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. చైనా మార్కెట్లో రెడ్మీనోట్ 4 ఫోన్‌ను ఆగష్టు, 2016లో లాంచ్ చేసారు. డిజైన్ పరంగా చూస్తే రెడ్మీ నోట్ 3 ఫోన్‌కు దగ్గర పోలికలను కలిగి ఉండే నోట్ 4 2.5 కర్వుడ్ గ్లాస్‌తో వస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రెండు వేరియంట్‌లలో...

రెడ్మీ నోట్ 4 ఫోన్ రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అందులో మొదటి వేరియంట్ 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌.

రెండవ వేరియంట్ 3జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోంది. మొదటి వేరియంట్ ధర రూ.9,000గానూ, రెండవ వేరియంట్ ధర రూ.12,000 వరకు ఉంటుంది.

రెడ్మీ నోట్ 4 స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920× 1080పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, మీడియాటెక్ హీలియో ఎక్స్20 డెకా‌కోర్ క్వాల్కమ్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4,100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం.

రెడ్మీ నోట్3 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920 పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్లాకోర్ సీపీయూతో కూడిన మీడియాటెక్ ఎంటీ6795 హీలియో ఎక్స్10 చిప్‌సెట్, ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ (16జీబి, 32జీబి), 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (2జీ, 3జీ, 4జీ, వై-ఫై, బ్లుటూత్), 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ క్విక్ ఛార్జింగ్ సపోర్ట్. ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Note 4 rumored to launch in India in January 2017. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot