Redmi Note 4 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేట్

అప్‌డేట్ తీసుకునే సమయంలో కనీసం మీ ఫోన్ 50% ఛార్జ్ అయి ఉండాలి. ఇదే సమయంలో వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

|

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం ఎదురుచూస్తోన్న రెడ్‌మి నోట్ 4 యూజర్లకు గుడ్ న్యూస్. త్వరలోనే మీమీ రెడ్‌మి నోట్ 4 యూనిట్లకు ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 అప్‌డేట్ లభించబోతోంది. GSMArena పోస్ట్ చేసిన కథనం ప్రకారం షియోమీ ఈ అప్‌డేట్ ప్రక్రియను బయట దేశాల్లో ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇండియాలో ఈ ప్రాసెస్ మొదలవటానికి మరికొద్ది రోజులు సమయం పడుతుందని సమాచారం.

బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్ ఏది..?బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్ ఏది..?

అప్‌డేట్‌కు సంబంధించిన ఫైల్..

అప్‌డేట్‌కు సంబంధించిన ఫైల్..

ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌కు సంబంధించిన ఫైల్ సైజు ఇంచుమించుగా 1.3జీబి వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఓవర్ ద ఎయిర్ రూపంలో లభించే ఈ అప్‌డేట్‌ను ఫోన్ Settings ->About Phone -> Software Updateలను తరచూ చెక్ చేసుకోవటం ద్వారా పొందవల్సి ఉంటుంది. అప్‌డేట్ తీసుకునే సమయంలో కనీసం మీ ఫోన్ 50% ఛార్జ్ అయి ఉండాలి. ఇదే సమయంలో వై-ఫై నెట్‌వర్క్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

నోట్ 4 యూజర్లకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అనుభూతులు

నోట్ 4 యూజర్లకు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అనుభూతులు

ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టంలో సెట్టింగ్స్ యాప్, పూర్తిగా రీడిజైన్ చేయబడిన యూజర్ ఇంటర్‌ఫేస్‌తో వస్తోంది. పలు మార్పు చేర్పులతో వస్తోన్న ఈ యాప్, ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మరింత వేగంగా ముందకు నడిపిస్తుంది. ఫొన్ సెట్టింగ్జ్ అడ్జస్ట్ చేసుకునేందుకు యూజర్ ప్రతిసారి సబ్ మెనూలోకి వెళ్లకుండా మెయిన్ మెనూ ద్వారానే కావల్సిన సెట్టింగ్స్ యాక్సెస్ చేసుకునే విధంగా సబ్ టైటిల్ వ్యవస్థ ఉంటుంది. ఆండ్రాయిడ్ నగౌట్ వర్షన్ ద్వారా మల్టీ-విండో మోడ్‌ను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్‌డేట్‌‍ను తీసుకోవటం ద్వారా రెడ్‌మి నోట్ 4 యూజర్లు లేటెస్ట్ ఆండ్రాయిడ్ అనుభూతులను ఆస్వాదించే వీలుంటుంది.

మూడు వేరియంట్‌లలో..

మూడు వేరియంట్‌లలో..

రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో మూడు వేరియంట్‌లలో లభిస్తోంది. వాటి వివరాలు.. 2జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ (ధర రూ.9,999), 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ (రూ.10,999), 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ (ధర రూ.12,999).

రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..

రెడ్‌మి నోట్ 4 స్పెసిఫికేషన్స్..

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ 2.5డి కర్వుడ్ గ్లాస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), 2.0GHz ఆక్టా కోర్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, అడ్రినో 506 జీపీయూ, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కెపాసిటీ, ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆపరేటింగ్ సిస్టం (నౌగట్ అప్‌డేట్). 4100 mAh బ్యాటరీ, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ సపోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ విత్ VoLTE సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ సపోర్ట్.

 Redmi Note 5 పై  భారీ అంచనాలు

Redmi Note 5 పై భారీ అంచనాలు

షియోమీ నుంచి లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లు భారీ విజయాలను నమోదు చేసిన నేపధ్యంలో, ఈ సిరీస్‌కు కొనసాగింపుగా రాబోతోన్న Redmi Note 5 పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకున్నాయి. ఆగష్టు 2017లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఇమేజెస్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్, అడ్రినో 508 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3790mAh బ్యాటరీ.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 4 starts receiving Android Nougat update. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X