షాకిస్తున్న Redmi Note 5 ఫీచర్లు

మరికొద్ది నెలల్లో మార్కెట్లోకి...

|

షియోమీ నుంచి లాంచ్ అయిన రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌లు భారీ విజయాలను నమోదు చేసిన నేపధ్యంలో, ఈ సిరీస్‌కు కొనసాగింపుగా రాబోతోన్న Redmi Note 5 పై మార్కెట్లో భారీ అంచనాలు నెలకున్నాయి. ఆగష్టు 2017లో లాంచ్ కాబోతోన్న ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ప్రమోషనల్ ఇమేజెస్ ఇప్పటికే ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

రెడ్‌మి నోట్ 5 కూడా బంపర్ హిట్టే..

రెడ్‌మి నోట్ 5 కూడా బంపర్ హిట్టే..

లీకైన ఈ ఫోటోలను బట్టి చూస్తే స్పెసిఫికేషన్స్ పరంగా రెడ్‌మి నోట్ 3, రెడ్‌మి నోట్ 4 బాటలోనే రెడ్‌మి నోట్ 5 కూడా బంపర్ హిట్ కొట్టడం ఖాయమని తెలుస్తోంది. అనధికారికంగా తెలియవచ్చిన సమాచారం ప్రకారం రెడ్‌మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్ ఈ విధమైన ఫీచర్లతో రాబోతోంది. వాటి వివరాలు...

Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

Redmi Note 5 స్పెసిఫికేషన్స్ (అన్‌అఫీషియల్)

5.5 ఇంచ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1080 x 1920పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 9 స్కిన్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 630 సాక్, అడ్రినో 508 జీపీయూ, 4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3790mAh బ్యాటరీ.

టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000లోపు..
 

టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000లోపు..

4జీ ఎల్టీఈ విత్ వోల్ట్ సపోర్ట్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, బ్లుటూత్ 5.0, క్విక్ ఛార్జ్ 4.0, హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ కార్డ్ స్లాట్, ఫింగర్ ప్రింట్ స్కానర్. మార్కెట్లో Redmi Note 5 టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.13,000 వరకు ఉండొచ్చని సమాచారం.

శక్తివంతమైన ప్రాసెసింగ్ కెపాసిటీతో..

శక్తివంతమైన ప్రాసెసింగ్ కెపాసిటీతో..

ఈ ఫోన్‌లో వినియోగించిన Snapdragon 630 SoCను Qualcomm కంపెనీ ఈ మధ్యనే మార్కెట్లో లాంచ్ చేసింది. X12 LTE మోడెమ్‌తో వస్తోన్న ఈ చిప్‌సెట్ వేగవంతమైన ఎల్టీఈ స్పీడ్‌లను ఆఫర్ చేస్తుంది. అంతేకాకుండా ఫోన్ పనతీరును కూడా బాగా మెరుగురస్తుంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5 Likely to Arrive in August With MIUI 9 and Snapdragon 630 SoC. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X