మరో సంచలనం దిశగా షియోమి, ఈ రోజే ముహూర్తం..

By Hazarath
|

చైనాకు చెందిన మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి ఈ రోజు మరో సంచలనానికి తెర తీయబోతోంది. ప్రతిష్మాత్మక ఫోన్ రెడ్‌మీ నోట్ 5ను ఇండియాలో లాంచ్ చేయబోతోంది. ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా రానున్న ఈ ఫోన్ ఇండియా మార్కెట్లో మరో సంచలనం దిశగా అడుగులు వేసేందుకు రెడీ అవుతోందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా ఇదే ఈవెంట్లోషియోమి Mi TV 4ని కూడా లాంచ్ చేయనుందనే వార్తలు వస్తున్నాయి. విడుదలకు ఒక రోజు ముందు రెడ్‌మీ నోట్ 5 ఫోన్‌కు చెందిన ఫీచర్లు నెట్‌లో లీకయ్యాయి. దాని ప్రకారం ఈ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

వాట్సప్ లేటెస్క్ స్కాం, ఒపెన్ చేశారా ఇక అంతే సంగతులు !వాట్సప్ లేటెస్క్ స్కాం, ఒపెన్ చేశారా ఇక అంతే సంగతులు !

లీకైన రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

లీకైన రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు

5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ భారీ డిస్‌ప్లే, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

రెడ్‌మీ నోట్ 5 ప్రొ

రెడ్‌మీ నోట్ 5 ప్రొ

ఇక రెడ్‌మీ నోట్ 5 మాత్రమే కాకుండా దీనికి మరిన్ని ఫీచర్లు జతచేయబడిన రెడ్‌మీ నోట్ 5 ప్రొను కూడా షియోమీ విడుదల చేయనున్నట్లు తెలిసింది. అందులో 5.99 ఇంచ్ భారీ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఫీచర్లు ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

రెండు ఫోన్ల ధరల వివరాలను ..
 

రెండు ఫోన్ల ధరల వివరాలను ..

ఇక ఈ రెండు ఫోన్ల ధరల వివరాలను మాత్రం షియోమీ ఇంకా వెల్లడించలేదు. కాగా గతేడాది వచ్చిన షియోమి రెడ్‌మి నోట్ 4 2జిబి ర్యామ్ ధర మార్కెట్లో రూ.9999గా ఉంది. 4జిబి ర్యామ్ ధర రూ. 12,999గా ఉంది. దీనికి అటూ ఇటూగా ఈ ఫోన్ ధరలు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

 Mi TV 4ను కూడా..

Mi TV 4ను కూడా..

ఇక దీంతో పాటు Mi TV 4ను కూడా షియోమి రీలీజ్ చేయబోతోంది. ultra-thin deviceతో రానున్న Mi TV 4 మార్కెట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా దీన్ని గతేడాది CES 2017లో ప్రదర్శనకు ఉంచిన సంగతి తెలిసిందే. 

ఫీచర్లు

ఫీచర్లు

ఈ టీవీ 49-inches, 55-inches and 65-inches వేరియంట్లలో మార్కెట్లోకి రానుంది. quad-core 64-bit processor, Dolby+DTS Cinema Audio Quality, LED television with minimal bezels, 4K HDR supportతో రానుందని సమాచారం.

ధర

ధర

దీని ధర 3,499 Yuanగా ఉండే అవకాశం ఉంది. మన ఇండియన్ కరెన్సీలో దీని ధర రూ. 35,500గా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వేరియంట్ సైజులను బట్టి ఈ ధరలు మారే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు ఈ లాంచింగ్ తర్వాతనే తెలిసే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5, Mi TV 4 launch in India today : Here’s what to expect More news at Gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X