రెడ్‌మి నోట్ 5 ప్రొ ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు, కండీషన్లు మర్చిపోవద్దు

రెడ్‌మి నోట్ 5 సీరిస్‌లో వచ్చిన ఖరీదైన ఫోన్ రెడ్‌మి నోట్ 5 ప్రొ ఇప్పుడు వినియోగదారుల కోసం 24 గంటలు అందుబాటులోకి వచ్చింది.

|

రెడ్‌మి నోట్ 5 సీరిస్‌లో వచ్చిన రెడ్‌మి నోట్ 5 ప్రొ ఇప్పుడు వినియోగదారుల కోసం 24 గంటలు అందుబాటులోకి వచ్చింది. మీరు ఇకపై ఎప్పుడైనా ఈ స్మార్ట్‌ఫోన్‌ని కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ కోసం ఎదురుచూసే అవకాశం లేకుండా కంపెనీ అఫిషియల్ సైట్ Mi.com ద్వారా మీరు కొనుగోలు చేయవచ్చు. ఫ్లాష్ సేల్ కి రాగానే నిమిషాల వ్యవధిలో ఈ ఫోన్ సేల్ అయిపోయి అవుట్ ఆఫ్ స్టాక్ అనే బోర్డులు దర్శనమిస్తుండటంతో కంపెనీ ఈ రకమైన నిర్ణయం తీసుకుంది. కాగా మరోక చీపెస్ట్ ఫోన్ Redmi Note 5 మాత్రం వారాంతపు ఫ్లాష్ సేల్స్ లో మాత్రమే అందుబాటులో ఉంచుతోంది. రెడ్‌మి నోట్ 5 ప్రొ 4జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 13,999గా ఉంది. అలాగే 6జిబి ర్యామ్ , 64 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ16, 999గా ఉంది. ఇండియా మార్కెట్లో ఈ సీరిస్ లో వచ్చిన ఫోన్లలో ఇదే అత్యధిక ధర కలిగిన ఫోన్..మరి ప్రాసెస్ ఎలా ఉంటుందనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

Airtel 30జిబి ఉచిత డేటా ఆఫర్, ఎటువంటి కండీషన్లు లేవుAirtel 30జిబి ఉచిత డేటా ఆఫర్, ఎటువంటి కండీషన్లు లేవు

మి.కామ్ ద్వారా..

మి.కామ్ ద్వారా..

యూజర్లు ఈ ఫోన్ ని మి.కామ్ ద్వారా కొనుగోలు చేయాలనుకుంటే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. షియోమి చెప్పిన వివరాల ప్రకారం ఈ ఫోన్ ఆర్డర్ చేసిన తరువాత 2 నుంచి 4 వారాల్లో డెలివరీ చేయబడుతుందని కంపెనీ తెలిపింది. యూజర్లు ఈ ఫోన్ కోసం అన్ని రోజులు ఎదురుచూడాల్సి ఉంటుంది.

ఎదురుచూడలేని యూజర్లకు..

ఎదురుచూడలేని యూజర్లకు..

అన్ని రోజులు ఎదురుచూడలేని యూజర్లకు మరో అవకాశం కూడా ఉంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే యూజర్లు ప్రతి బుధవారం ఫ్లిప్‌కార్ట్‌లో జరిగే ఫ్లాష్ సేల్‌లో Redmi Note 5 Pro, Redmi Note 5లను సొంతం చేసుకోవచ్చు.

నో క్యాష్ అండ్ డెలివరీ
 

నో క్యాష్ అండ్ డెలివరీ

అయితే ఇక్కడ యూజర్ల మరో విషయాన్ని గమనించాలి. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ కి క్యాష్ అండ్ డెలివరీ ఆప్సన్ లేదు. యూజర్లు ఖచ్చితంగా ముందుగానే ఫోన్ ధరను పే చేయాల్సి ఉంటుంది. ఆ తరువాతనే ప్రాసెస్ మొదలవుతుంది. మొత్తం 5 రోజుల పనిదినాల్లో ఈ ఫోన్ యూజర్ల చేతికందుతుంది.

కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన తరువాత ..

కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన తరువాత ..

కంపెనీ అఫిషియల్ సైట్లో కొనుగోలు చేయాలనేకునే వారికి ఈ ప్రాసెస్ 2 నుంచి 4 వారాలు పడుతుంది. ఇక్కడ కూడా cash on delivery ఆప్సన్ లేదు. మొత్తం ఫోన్ ధరను ముందుగానే పే చేయాలి. అలాగే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చిన తరువాత యూజర్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తమ చిరునామాను మార్చకూడదని కంపెనీ తెలిపింది. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించింది.

 1 లేదా రెండు ఫోన్లు మాత్రమే..

1 లేదా రెండు ఫోన్లు మాత్రమే..

క్యాన్సిల్ చేయాలనుకున్న వారు షిప్పింగ్ కంటే ముందుగానే క్యాన్సిల్ చేసుకోవాలి. ఆ తరువాత క్యాన్సిల్ చేసుకుంటే దానికి కంపెనీ ఎటువంటి బాధ్యత వహించదని తెలిపింది. ఇక యూజర్లు 1 లేదా రెండు ఫోన్లు మాత్రమే కొనుగోలు చేయాలి. మరిన్ని ఫోన్లను కొనుగోలు చేసేందుకు అవకాశం లేదు. మీరు క్యాన్సిల్ చేసుకున్న తరువాత 5 నుంచి 7 రోజుల్లో మీ మొత్తం అమౌంట్ తిరిగి రీఫండ్ చేయబడుతుంది.

ఎంపిక చేసిన ఆఫ్ లైన్ స్టోర్లలో..

ఎంపిక చేసిన ఆఫ్ లైన్ స్టోర్లలో..

ఎంపిక చేసిన ఆఫ్ లైన్ స్టోర్లలో Redmi Note 5 అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. కాగా ఆఫ్ లైన్ ద్వారా Redmi Note 5 కొనుగోలు చేయాలనుకున్న వారు అదనంగా రూ.500 పే చేయాల్సి ఉంటుంది. కాగా Redmi Note 5 ప్రొ మాత్రం ఆఫ్ లైన్ స్టోర్లలో అందుబాటులో ఉండదు. కంపెనీ అఫిషియల్ సైట్లో మాత్రమే కొనుగోలు చేయాలి. కాకపోతే అదనపు ఛార్జీలు ఏమి లేకుండా ఉచిత డెలివరీ ఉంటుంది.

ఫీచర్లు

ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ నోట్ 5 ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.
షియోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రొ ఫీచర్లు
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

 

 

Best Mobiles in India

English summary
Redmi Note 5 Pro pre-orders now open on Mi.com: Terms and conditions, how it works More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X