రెడ్‌మి నోట్ 5 ప్రో VS ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1, రూ.15,000 బడ్జెట్‌లో గెలుపు ఎవరిది?

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది.

By GizBot Bureau
|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రస్తుత ట్రెండ్‌ను పరిశీలించినట్లయితే రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. వీటిలో మొదటి ఫోన్ రెడ్‌మి నోట్ 5 ప్రో (Redmi Note 5 Pro ) కాగా రెండవది ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్ 1 (Asus ZenFone Max Pro M1). 18:9 డిస్‌ప్లేలతో వస్తోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లలో డ్యుయర్ రేర్ కెమెరా సపోర్టుతో పాటు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. స్నాప్‌డ్రాగన్ 636 సాక్ పై రన్ అవుతోన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి Spec Comparisonను ఇప్పుడు చూద్దాం..

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి...

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి...

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి ఈ స్మార్ట్‌ఫోన్‌లు 18:9 డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. ఫోన్ వెనుక భాగాల్లో నిలువుగా మర్చిన డ్యుయల్ కెమెరా సెటప్స్, రేర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ ఆధునిక ట్రెండ్‌కు అద్దంపడతాయి. ఇక బాడీబిల్డ్ విషయానికి వచ్చేసరికి నోట్ 5 ప్రో డివైస్‌ పూర్తి అల్యూమినియమ్ బాడీని కలిగి ఉంటే, జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్ 1 మాత్రం మెటల్ బ్యాక్‌ప్లేట్‌తో పాటు టాప్ ఇంకా బోటమ్ ప్లాస్టిక్ ఇన్సర్ట్స్‌ను కలిగి ఉంటుంది.

 

 

 బిల్డ్ క్వాలిటీ పరంగా...

బిల్డ్ క్వాలిటీ పరంగా...

బిల్డ్ క్వాలిటీ పరంగా మరింత సాలిడ్‌గా కనిపించే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు చేతిలో సౌకర్యవంతంగా ఇమిడిపోతాయి. ఈ రెండు ఫోన్‌లకు సంబంధించి ఫింగర్ ప్రింట్ సెన్సార్స్‌ను పరీక్షించి చూడగా రెండూ ఒకే విధమైన ఖచ్చితత్వాన్ని కలిగి ఉన్నప్పటికి నోట్ 5 ప్రోదే పై చేయిగా ఉంటుంది. యూఎస్బీ టైప్-సీ పోర్టుకు దూరంగా ఉన్న ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఛార్జింగ్ అలానే డేటా ట్రాన్స్‌ఫర్ ప్రాసెస్ నిమిత్తం మైక్రో-యూఎస్బీ పోర్టులను అందుబాటులో ఉంచాయి.

 

 

డిస్‌ప్లే ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..
 

డిస్‌ప్లే ఇంకా స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి..

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ 18:9 డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. ఈ రెండు డిస్‌ప్లేలకు సంబంధించి క్వాలిటీని కంపేర్ చేసి చూసినట్లయితే జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1కు సంబంధించిన డిస్‌ప్లే వివిడ్ కలర్స్‌తో మరింత బ్రైట్‌గా కనిపిస్తోంది. ఇదే సమయంలో రెడ్‌మి నోట్ 5 ప్రో డిస్‌ప్లే వ్యూవింగ్ యాంగిల్స్ పరంగా అదరగొడుతున్నప్పటికి మిగిలిన విభాగాల్లో మాత్రం డల్‌గా అనిపిస్తోంది. ఈ రెండు ఫోన్‌లు ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ పై రన్ అవుతున్నాయి. కాబట్టి ప్రాసెసింగ్ విషయంలో ఎటువంటి విషయంలో మార్పులు లేవు.

ర్యామ్ విషయానికి వచ్చేసరికి...

ర్యామ్ విషయానికి వచ్చేసరికి...

ర్యామ్ విషయానికి వచ్చేసరికి రెడ్‌మి నోట్ 5 ప్రో 4జీబి అలానే 6జీబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమవుతోంది. జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 3జీబి, 4జీబి అలానే 6జీబి ర్యామ్ వేరియంట్‌లలో లభ్యమవుతుంది. స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు డివైస్‌లు 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. నోట్ 5 ప్రోలో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ కనెక్టర్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు పెంచుకోవచ్చు. ఇదే సమయంలో మాక్స్ ప్రో ఎమ్1లో ఏర్పాటు చేసిన మైక్రోఎస్డీ స్లాట్ కనెక్టర్ ద్వారా స్టోరేజ్ కెపాసిటీని 2టీబి వరకు పెంచుకునే అవకాశాన్ని కల్పించారు.

 

 

 

శక్తివంతమైన బ్యాటరీ...

శక్తివంతమైన బ్యాటరీ...

ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసరికి ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్ 1 ఏకంగా 5000mAh బ్యాటరీ కెపాసిటీని కలిగి ఉంది. ఇదే సమయంలో రెడ్‌మి నోట్ 5 ప్రో 4000mAh బ్యాటరీతో వస్తోంది. సిమ్ కనెక్టువిటీ విషయానికి వచ్చేసరికి ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్ 1లో రెండు నానో సిమ్ స్లాట్‌లతో పాటు విడిగా మైక్రోఎస్డీ స్లాట్‌ను కలిగి ఉంటుంది.ఇదే సమయంలో రెడ్‌మి నోట్ 5 ప్రో హైబ్రీడ్ డ్యుయల్-సిమ్ ట్రేతో వస్తోంది. ఇందులో సెకండ్ సిమ్‌నే మైక్రోఎస్డీ స్లాట్‌గా ఉపయోగించుకోవల్సి ఉంటుంది.

 

 

 

కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి...

కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి...

ఇక కనెక్టువిటీ ఫీచర్స్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లలో 4జీ VoLTE, వై-ఫై 802.11b/g/n, జీపీఎస్, ఏ-జీపీఎస్, బ్లుటూత్ 5.0, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ సాకెట్ వంటి స్టాండర్ట్ కనెకన్టువిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇక సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారంగా అభివృద్థి చేసిన సొంత యూజర్ ఇంటర్‌ఫేస్‌ల పై రన్ అవుతాయి. ఇక కెమేరా విషయానికి వచ్చేసరికి ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లకు డ్యుయర్ రేర్ కెమెరా సపోర్టు ప్రధానమైన హైలైట్‌గా నిలుస్తుంది. వీటి కేమెరా స్పెక్స్ పరిశీలించినట్లయితే ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్ 1.. 16 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

 

 

ధరల వివరాలు..

ధరల వివరాలు..

ఇక రెడ్‌మి నోట్ 5 ప్రో విషయానికి వచ్చేసరికి 12 మెగా పిక్సల్ + 5 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 20 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది. మార్కెట్లో వీటి ధరలను పరిశీలించినట్లయితే 4జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తోన్న రెడ్‌మి నోట్ 5 ప్రో ధర రూ.14,999గా ఉంది. ఇదే సమయంలో 6జీబి ర్యామ్ + 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీతో వస్తోన్న ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ ప్రో ఎమ్1 ధర రూ.14,999గా ఉంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా లభ్యమవుతున్నాయి.

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 5 Pro vs Asus ZenFone Max Pro M1 (6GB).To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X