నవంబర్ 6న లాంచ్ కానున్న షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రొ
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి నుంచి మరో ఫోన్ రిలీజ్ కాబోతోంది. షియోమి లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్ 6 ప్రొ లాంఛింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమి నుంచి మరో ఫోన్ రిలీజ్ కాబోతోంది. షియోమి లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్ 6 ప్రొ లాంఛింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. షియోమి నుంచి వచ్చిన రెడ్‌మి నోట్ 5 ప్రొ సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. ఇప్పటికీ ఈ మోడల్ టాప్ సెల్లింగ్ ఫోన్లల్లో ఉండటం విశేషం. ఇప్పుడు దాని అప్‌గ్రేడ్ వర్షన్ అయిన రెడ్‌మి నోట్ 6 ప్రొ మార్కెట్లోకి వచ్చేస్తోంది.అయితే ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా రెడ్‌మీ నోట్ 5 ప్రొ లాగే ఉంటాయని అంచనా.

ఫీచర్లు...
6.26 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో,, ఎంఐయూఐ 9.6, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

6.26 ఇంచుల భారీ డిస్‌ప్లే...
ఇందులో 6.26 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ఏర్పాటు చేశారు. ఈ ఫోన్ స్క్రీన్-టు-బాడీ రేషియో 87.6 శాతం ఉంది

నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మి నోట్ 6 ప్రొ ప్రత్యేకతలు....
నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మి నోట్ 6 ప్రొ యొక్క ప్రత్యేకతలు. రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ని ఆకట్టుకోనుంది రెడ్‌మి నోట్ 6 ప్రొ.

నాలుగు కెమెరాలు....
ఇందులో నాలుగు కెమెరాలు అమర్చారు . ముందు భాగంలో 20,2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు అందిస్తున్నారు.వెనుక భాగంలో 12,5 మెగాపిక్సల్ కెమెరాలు రెండు ఉన్నాయి.

గతంలో వచ్చిన రెడ్‌మి నోట్ 5 ప్రొ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
5.99 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్‌ప్లే, 2160 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.


Click it and Unblock the Notifications