ఫిబ్రవరి మొదటి వారంలో లాంచ్ కానున్న Redmi Note 7
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ Redmi Note 7 ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.
చైనా మొబైల్స్ తయారీ దిగ్గజం షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ Redmi Note 7 ను ఇండియా మార్కెట్లో విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్ వచ్చే నెల మొదటి వారంలో లాంచ్ చేయనుంది. ఇతర దిగ్గజాలకు సవాలు విసురుతూ 48 ఎంపి కెమెరా ఫోన్ ని మార్కెట్లోకి తీసుకరాబోతుంది. అంతేకాదు డిఫరెంట్ డిజైన్, డ్యూడ్రాప్ న్యాచ్‌తో షియోమి తొలి స్మార్ట్‌ఫోన్‌గా Redmi Note 7 నిలవనుంది.ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.10,390 ఉండవచ్చు అని సమాచారం.

ధరలు(అంచనా) :
3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.10,390
4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,460
6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధరను రూ.14,540

6.3 ఇంచ్ డిస్‌ప్లే
6.3 ఇంచ్ డిస్‌ప్లేతో పాటు 1080p screen ఈ ఫోన్ కి ప్రత్యేక ఆకర్షణ. 2340x1,080 pixelsతో యూజర్లకు మంచి విజువల్ అనుభవాన్ని అందిస్తుంది.

48 మెగాపిక్సెల్ కెమెరా
ఈ ఫోన్ వెనుక భాగంలో 48, 5 మెగాపిక్సల్ డ్యూయల్ కెమెరాలను ఉన్నాయి. ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.

ఆపరేటింగ్ సిస్టమ్,బ్యాటరీ
ఈ స్మార్ట్ ఫోన్ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టం తో రన్ అవుతుంది. బ్యాటరీ విషయానికొస్తే 4000 ఎమ్ఎహెచ్ బ్యాటరీ ను కలిగి ఉంటుంది.

ఫీచర్లు
6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్, 3/4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 48, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, డ్యుయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ 4.0.


Click it and Unblock the Notifications








