Home
Mobile

48 ఎంపి కెమెరాతో రెడ్‌మి నోట్ 7, రిలీజ్ డేట్ ఫిక్స్

By Gizbot Bureau

చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం షియోమి తన నూత‌న స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7 భార‌త్ లో విడుద‌లపై క్లారిటీ ఇచ్చింది. ఎప్పటినుంచో స్మార్ట్‌ఫోన్‌ ప్రియులు ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవవరి 28న ఆవిష్కరించన్నుట్టు అధికారిక ట్విటర్లో షియోమి ప్రకటించింది. ఇప్పటికే చైనా మార్కెట్లో ఈ ఫోన్ మిలియన్‌ అమ్మకాలతో దూసుకుపోతోంది.

Xiaomi Redmi Note 7 with 48MP camera set to launch in India on February 28 More news at Gizbot Telugu

చైనాలో ఈ ఫోన్ విజయవంమైన నేపథ్యంలో ఇండియాలో కకూడా ఈ ఫోన్ విజయవంతం అవుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. కాగా ఆకట్టుకునే ఫీచర్లతో అత్యంత తక్కువ ధరలో ఈ ఫోన్ వినియోగదారుల చెంతకు రానుంది.

షియోమీ రెడ్‌మి నోట్‌7 ఫీచ‌ర్లు

షియోమీ రెడ్‌మి నోట్‌7 ఫీచ‌ర్లు

6.3 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 2340 ×1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌, 3/4/6 జీబీ ర్యామ్‌, 32/64 జీబీ స్టోరేజ్‌, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 48, 5 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐఆర్ సెన్సార్, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, క్విక్ చార్జ్ 4.0.

రెడ్‌మి నోట్‌7 కెమెరా

రెడ్‌మి నోట్‌7 కెమెరా

రెడ్‌మి నోట్‌7లో 48 మెగాపిక్స‌ల్ కెపాసిటీ ఉన్న భారీ కెమెరాను అమర్చగా మూడు వేరియంట్లలో బ్లాక్‌, బ్లూ, ప‌ర్పుల్ క‌ల‌ర్ ఆప్ష‌న్లలో లభించనుంది. 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీని ఈ ఫోన్‌లో అందిస్తున్నారు.

రెడ్‌మి నోట్‌7 స్టోరేజ్‌

రెడ్‌మి నోట్‌7 స్టోరేజ్‌

3 జీబీ/32జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ రూ.10,390 ధ‌ర‌కు ల‌భ్యం కానుందని తెలుస్తోంది. 4జీబీ/64జీబీ స్టోరేజ్‌ ధర రూ. 12,460,6జీబీ/64జీబీ స్టోరేజ్‌ ధర రూ.14,540లుగా ఉండనుందని అంచనా.

చైనాలో దీని ధరను 999 యువాన్ అంటే మ కరెన్సీలో చెప్పాలంటే రూ.10,500గా నిర్ణయించారు. మరి ఇదే ధరకు ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అన్న దానిపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కాని లాంచింగ్ డేట్ మాత్రం ఫిక్స్ అయింది.


Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 7 with 48MP camera set to launch in India on February 28 More news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X