అమెజాన్ లో గొప్ప ఆఫర్లతో రెడ్‌మి నోట్ 8 ప్రో సేల్స్

|

దీపావళి సేల్స్ తరువాత మళ్ళి షియోమి యొక్క రెడ్‌మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్ ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటల నుండి సేల్స్ మొదలు కానున్నాయి. ఈ రెడ్‌మి స్మార్ట్‌ఫోన్ యొక్క సేల్స్ అమెజాన్ లో నిర్వహించనున్నాయి. అమెజాన్ ద్వారా దీనిని ఇప్పుడు గొప్ప డిస్కౌంట్ ధరకు పొందవచ్చు.

ధరలు
 

ధరలు

రెడ్‌మి నోట్ 8 ప్రో ఇండియాలో మొదటిసారిగా ఆగస్టు నెలలో నోట్ 8 తో పాటు విడుదల అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 జిబి ర్యామ్ + 64 జిబి స్టోరేజ్‌ ఆప్షన్ తో రూ.14,999 ధర వద్ద లభిస్తుంది. అలాగే ఇందులో 128 జీబీ స్టోరేజ్‌తో ఉన్న 6 జీబీ, 8 జీబీ ర్యామ్ వేరియంట్‌ల ధరలు వరుసగా రూ.15,999 మరియు రూ.17,999. హలొ వైట్, గామా గ్రీన్ మరియు షాడో బ్లాక్ అనే మూడు కలర్ లలో ఈ హ్యాండ్‌సెట్‌ను విడుదల చేశారు.

అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌అమెజాన్ ఫైర్ టీవీలో ఆపిల్ టీవీ యాప్‌

ఎయిర్‌టెల్ ఆఫర్స్

ఎయిర్‌టెల్ ఆఫర్స్

షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో కొనుగోలుపై డబుల్ డేటా ఆఫర్‌ను భారతి ఎయిర్‌టెల్ లిమిటెడ్ అందిస్తోంది. షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో మరియు షియోమి రెడ్‌మిలలో ఎయిర్‌టెల్ యొక్క మొబిలిటీ సేవలను పొందాలనుకునే కొత్త / ఇప్పటికే ఉన్న ప్రీ-పెయిడ్ చందాదారులు రూ .249 మరియు రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జిలలో మాత్రమే ఆఫర్‌కు అర్హులు. ఆఫర్ అర్హతగల హ్యాండ్‌సెట్‌లో 48 గంటల ఎయిర్‌టెల్ సిమ్ చొప్పించడం నుండి మొదటి 10 రీఛార్జిలకు లేదా మొదటి 10 నెలలకు ఈ ఆఫర్ చెల్లుతుంది. ఈ ప్రయోజనంతో ఎయిర్‌టెల్ యొక్క రూ.249 రీఛార్జి ఇప్పుడు 4GB డేటాను అందిస్తుంది. ఎయిర్‌టెల్ యొక్క రూ.349 రీఛార్జి ఇప్పుడు 6GB డేటాను అందిస్తుంది.

EMI ఆఫర్స్

EMI ఆఫర్స్

షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రోను కొనుగోలు చేయడానికి అమెజాన్ లో అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ నో-కాస్ట్ EMI ఎంపికను అందిస్తోంది. అలాగే ఇతర కార్డులపై కూడా అతి తక్కువ EMIలను అందిస్తుంది.

రెడ్‌మి నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్
 

రెడ్‌మి నోట్ 8 ప్రో స్పెసిఫికేషన్స్

రెడ్‌మి నోట్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 91.4 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో 6.53-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 3D కర్వ్డ్ గ్లాస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది గ్రీన్ కలర్ ఆప్షన్‌లో లభిస్తుంది. రెడ్‌మి నోట్ 8 యొక్క ప్రో వెర్షన్ వెనుక భాగంలో డైమండ్ కట్ గ్రేడ్ ఆకృతిని ప్రదర్శిస్తుంది. ఇందులో మెడిటెక్ G90t గేమింగ్ చిప్‌సెట్ మద్దతు లభిస్తుంది.

డిష్ టివి యొక్క 3 రకాల STBల ప్రయోజనాలు ఏమిటో తెలుసా??డిష్ టివి యొక్క 3 రకాల STBల ప్రయోజనాలు ఏమిటో తెలుసా??

కెమెరా

ఈ స్మార్ట్‌ఫోన్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఎఫ్ / 1.7 ఇమేజ్ సెన్సార్ తో వస్తుంది. ఇది వినియోగదారులకు మెరుగైన ఫోటో షాట్లను అందిస్తుందని చైనా కంపెనీ తెలిపింది. ఇంకా దీని ద్వారా గరిష్టంగా 9248 x 6936 రిజల్యూషన్ వద్ద కూడా షూట్ చేయగలరు. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ కాకుండా ఇతర సెన్సార్లు ప్రామాణిక వెర్షన్ వలె ఉంటాయి. ఇది స్లో-మోషన్ వీడియో రికార్డింగ్‌కు మద్దతును కూడా అందిస్తుంది. ముందు వైపు 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఎక్కువ డేటా కోసం ACT ఫైబర్‌నెట్ అందిస్తున్న 5 కొత్త ఫ్లెక్సీబైట్స్ ప్లాన్‌లుఎక్కువ డేటా కోసం ACT ఫైబర్‌నెట్ అందిస్తున్న 5 కొత్త ఫ్లెక్సీబైట్స్ ప్లాన్‌లు

కనెక్టివిటీ

ఫోన్ యాక్సిస్ కోసం వెనుక వైపు మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. షియోమి రెడ్‌మి నోట్ 8 ప్రో 4,500 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉండి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్‌తో వస్తుంది. కనెక్టివిటీ ఎంపికల పరంగా ఇందులో వైఫై, బ్లూటూత్, జిపిఎస్ మరియు 4G LTE కి మద్దతు ఇస్తుంది. ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్ మద్దతు కూడా ఉంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Xiaomi Redmi Note 8 Pro Flash Sales Start Today at 12 PM: Price in India, Specs, Offers Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X