షియోమీ రెడ్‌మై నోట్ (హ్యాండ్స్ ఆన్ వీడియో రివ్యూ)

Posted By:

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ షియోమీ (Xiaomi) తన సరికొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో షియోమీ ఎమ్ఐ3, రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని ఆవిష్కరించింది. వీటిలో షియోమీ ఎమ్ఐ3 స్మార్ట్ ఫోన్ లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ విక్రయిస్తోంది. మరో ఫోన్ రెడ్‌మై 1ఎస్ సెప్టంబర్ 2 నుంచి ఫ్లిప్ కార్ట్ వద్ద లభ్యం కానుంది.

షియోమీ రెడ్‌మై నోట్ (హ్యాండ్స్ ఆన్ వీడియో రివ్యూ)

షియోమీ ఆవిష్కరించిన మరో పెద్దతెర స్మార్ట్‌ఫోన్ రెడ్‌మై నోట్‌కు సంబంధించి మార్కెట్లో ఆసక్తికర అంచనాలు నెలకున్నాయి.  మార్కెట్లో రెడ్‌మై నోట్ ఫాబ్లెట్ అందుబాటుకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

రెడ్‌మై నోట్ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్ 720 పిక్సల్ ఐపీఎస్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఇంటర్‌ఫేస్ ఆధారంగా రూపకల్పన చేయబడిన ఎంఐయూఐ వర్షన్ 5 పై ఫోన్ రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 3జీ, వై-ఫై, యూఎస్బీ, ఫోన్ ధర రూ.9,999.

షియోమీ రెడ్‌మై నోట్ మొదటి ఇంప్రెషన్‌కు సంబంధించి హ్యాండ్స్ ఆన్ రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/xCyqPswuGV0? feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Xiaomi Redmi Note HANDS ON. Read more in Telugu Gizbot......
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot