జియోమీ రెడ్‌మై నోట్, రెడ్‌మై 1ఎస్

|

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ జియోమీ (Xiaomi) తన సరికొత్త ఉత్పత్తులను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. మంగళవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో జియోమీ ఎమ్ఐ3, రెడ్‌మై 1ఎస్, రెడ్‌మై నోట్ వేరియంట్‌లలో మూడు స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మై ప్యాడ్ పేరుతో ఓ ట్యాబ్లెట్ పీసీని జియోమీ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో జియోమీ కంపెనీ సీఈఓ లిన్ బిన్, వైస్ ప్రెసిడెంట్ హుగో బర్రా, జియోమీ ఇండియా ఆపరేషన్ హెడ్ మను కుమార్ జైన్ తదితర పాల్గొన్నారు. ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించి స్పెసిఫికేషన్ లను పరిశీలించినట్లయితే...

రెడ్‌మై నోట్ ఆక్టా కోర్ స్మార్ట్‌ఫోన్ 720 పిక్సల్ ఐపీఎస్ రిసల్యూషన్ క్వాలిటీతో కూడిన 5.5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 2జీబి ర్యామ్, 1.7గిగాహెట్జ్ మీడియాటెక్ ఎంటీ6592 ఆక్టా కోర్ ప్రాసెసర్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (వీడియో కాలింగ్ నిర్వహించుకునేందుకు), 3200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర రూ.9,999. మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

రెడ్‌మై 1ఎస్

రెడ్‌మై 1ఎస్ స్మార్ట్‌ఫోన్‌‍కు సంబంధించి స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా. ఫోన్ అందుబాటుకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X