షియోమి కొత్త ఫోన్, దుమ్మురేపుతున్న ఫీచర్లు ఇవే !

Written By:

ఎప్పటినుంచో ఊరిస్తూ వస్తున్న షియోమి రెడ్‌మి ప్రో 2 ఫీచర్లు రోజుకొకకటి లీకవుతూ సంచలనం రేపుతున్నాయి. గతేడాది రెడ్‌మి ప్రోతో సంచలనం సృష్టించిన షియోమి రెడ్‌మి ప్రో 2తో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. డ్యూయెల్ కెమెరాతో రెడ్‌మి ప్రో 2ను తీసుకురానున్నట్లు లీకయిన రిపోర్టులు తెలియజేస్తున్నాయి. ఫీచర్స్ కూడా అదే స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఫీచర్లు కింది విధంగా ఉండే అవకాశం ఉందని లీకయిన రిపోర్టులు తెలియజేస్తున్నాయి.

మళ్లీ పంజా విప్పనున్న Airtel..!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఎల్ సీడీ డిస్ ప్లే

రెడ్‌మి ప్రో ఓఎల్ డి డిస్ ప్లేతో వచ్చిన సంగతి విదితమే. అయితే రానున్న రెడ్‌మి ప్రో 2 ఎల్ సీడీ డిస్ ప్లేతో రానుందని రిపోర్టులు తెలియజేస్తున్నాయి. దీంతో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లేతో పాటు 1080 X 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ను కలిగి ఉంది.స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ ను కూడా కలిగి ఉందని చైనా వెబ్ సైట్ గిజ్ మో చైనా తెలియజేసింది.

image: redmi pro

 

కెమెరా

కెమెరా విషయానికొస్తే 12 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్ తో నచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీ అభిమానుల కోసం 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. అయితే లీకయన కొన్ని రిపోర్టులు 12 ఎంపీతో రానున్నట్లు తెలియజేస్తున్నాయి.
image: redmi pro

బ్యాటరీ

బ్యాటరీ విషయానికొస్తే 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, క్విక్ చార్జ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ ఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అదనపు ఆకర్షణలు.
image: redmi pro

ర్యామ్

ర్యామ్ విషయానికొస్తే 4/6 జీబీ ర్యామ్ తో పాటు 64/128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని ఈ ఫోన్ కలిగి ఉంది. మైక్రో ఎస్ డీ ద్వారా 256 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ చేసుకోవచ్చని తెలుస్తోంది.
image: redmi pro

ధర

చైనా కరెన్సీలో అయితే చైనా కరెన్సీలో 4జిబి ర్యామ్ 64జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర 1599 యువాన్లుగా ఉంది. 6జిబి ర్యామ్ 128జిబి ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర 1799యువాన్లుగా ఉంది.
image: redmi pro

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Pro 2 leaked specifications reveal full HD LCD display, dual-cameras and more read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot