ఇండియాకు షియోమి బెస్ట్ సెల్పీ స్మార్ట్‌ఫోన్‌,ధర, ఫీచర్లపై పూర్తి వివరాలు !

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇటీవల చైనాలో లాంచ్‌ చేసిన అఫార్డబుల్‌ సెల్ఫీ సెట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి ఎస్‌2ను ఇండియా మార్కెట్లోకి తీసుకొస్తోంది.

|

చైనా మొబైల్ దిగ్గజం షియోమి ఇటీవల చైనాలో లాంచ్‌ చేసిన అఫార్డబుల్‌ సెల్ఫీ సెట్రిక్‌ స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి ఎస్‌2ను ఇండియా మార్కెట్లోకి తీసుకొస్తోంది. అయితే ఇది పేరు మార్చుకుని ఇండియా మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్‌మి వై2 పేరుతో భారత మార్కెట్‌లోకి లాంచ్‌ చేస్తుందని తెలుస్తోంది. కాగా తన తర్వాత స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్‌ను షియోమి తన ట్విటర్‌ అకౌంట్‌ ద్వారా ధృవీకరించింది. కొత్త రెడ్‌మి హ్యాండ్‌సెట్‌ లాంచింగ్‌ గురించి సోషల్‌ మీడియా ఛానల్స్‌లో టీజ్‌ చేసింది. బెస్ట్‌ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్' ను జూన్‌ 7న మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనున్నట్టు షియోమి టీజర్‌ పోస్టు చేసింది. కానీ మిగతా వివరాలను వెల్లడించలేదు.

స్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్‌ఫోన్లుస్టన్నింగ్ ఫీచర్లతో అతి త్వరలో రానున్న 7 స్మార్ట్‌ఫోన్లు

షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు

షియోమీ రెడ్‌మీ ఎస్2 ఫీచర్లు

5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ.

చైనా మార్కెట్లో రెడ్‌మి ఎస్‌2 ధర

చైనా మార్కెట్లో రెడ్‌మి ఎస్‌2 ధర

3జీబీ ర్యామ్‌, 32జీబీ స్టోరేజ్‌ ధర సీఎన్‌వై 999(సుమారు రూ.10,600). 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర సీఎన్‌వై 1299(సుమారు రూ.13,700). ఈ రెండు వేరియంట్లు గోల్డ్‌, ప్లాటినం సిల్వర్‌, రోజ్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటు. అయితే భారత్‌లో వీటి ధరలు ఎంత ఉంటాయన్నది ఇంకా రివీల్‌ కాలేదు.

రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్‌ స్మార్ట్‌ఫోన్లకు

రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్‌ స్మార్ట్‌ఫోన్లకు

కాగా రెడ్‌మి వై1, రెడ్‌మి వై1 లైట్‌ స్మార్ట్‌ఫోన్లకు కొనసాగింపుగా రెడ్‌మి ఎస్‌ 2 వచ్చింది. రెడ్‌మి ఎస్‌2 అచ్చం ఎంఐ 6ఎక్స్‌ మాదిరిగానే ఉంది. అయితే ఎంఐ 6ఎక్స్‌ కంటే రెడ్‌మి ఎస్‌2నే తక్కువ. ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రొ ఎం1, హానర్‌ 9 లైట్‌ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

#ఫైండ్‌యువర్‌సెల్ఫీ

#ఫైండ్‌యువర్‌సెల్ఫీ

కాగా కంపెనీ టీజర్లో జూన్‌7న న్యూఢిల్లీలో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ ఈవెంట్‌ ఉందని తెలిపింది. #ఫైండ్‌యువర్‌సెల్ఫీ, #రియల్‌యూ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ఈ టీజర్‌ను తన అఫిషియల్ సైట్‌లో పోస్టు చేసింది.

రెడ్‌మి ఎస్‌2

రెడ్‌మి ఎస్‌2

ప్రధానంగా ఈ టీజర్లోని హ్యాష్‌ట్యాగ్‌ల్లో ‘వై'ను హైలెట్‌ చేసింది. దీని ప్రకారం షియోమి జూన్‌ 7న తీసుకొచ్చే డివైజ్‌ రెడ్‌మి వై2 అని తెలుస్తోంది. కానీ కంపెనీ ఇటీవల చైనాలో లాంచ్‌ చేసిన స్మార్ట్‌ఫోన్‌ రెడ్‌మి ఎస్‌2. ఇదే కంపెనీకి బెస్ట్‌ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్‌గా షియోమి అభివర్ణించింది. దీంతో రెడ్‌మి ఎస్‌2 స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి రెడ్‌మి వై2 పేరుతో లాంచ్‌ చేయనుందని సమాచారం.

 

 

Best Mobiles in India

English summary
Xiaomi Redmi S2 India launch set for June 7, maybe rebranded as Redmi Y2 More News At Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X