సైలెంట్‌గా దూసుకొస్తున్న Redmi S2, సర్‌ప్రైజ్ అంటున్న షియోమి

చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమి మే 10న తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ రెడ్‌మి ఎస్2ని రిలీజ్ చేయనుంది.

|

చైనా మొబైల్ తయారీ దిగ్గజం షియోమి మే 10న తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ రెడ్‌మి ఎస్2ని రిలీజ్ చేయనుంది. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ ఫోన్ ని మార్కెట్లోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. Redmi S2ను మార్చి 10న తీసుకొస్తున్నట్లు షియోమి అధికారికంగా ఈ రోజు ప్రకటించింది. బడ్జెట్ ధరలో రానున్న ఈ ఆండ్రాయిడ్ ఫోన్ చైనా సైట్ Suning.comలో ఎక్స్ క్లూజివ్ గా విక్రయానికి రానుంది. ప్యారాచూట్ తో కూడిన ఓ అఫిషియల్ టీజర్ ని విడుదల చేసింది. ఎస్ తో ఫోన్ రాబోతుందని సర్ ప్రైజ్ అని ప్యారాచూట్ లో కనిపిస్తుండగా పక్కన చైనా యాక్టర్ Liu Haoran Redmi S2 ఫోన్ పట్టుకుని చూపిస్తున్నట్లుగా టీజర్ రిలీజ్ చేసింది.

Redmi S2

ఈ విషయాన్ని ప్రముఖ చైనా వెబ్‌సైట్ Weibo page కూడా ధృవీకరించింది. మే 10న ఈ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కాగా Redmi S సీరిస్ లో దూసుకొస్తున్న మొట్టమొదటి ఫోన్ కూడా ఇదే కావడం గమనార్హం. ఈ ఫోన్ ఫీచర్లు Redmi Note 5 Pro అలాగే రీసెంట్ గా అనౌన్స్ చేసిన Mi 6Xకు దగ్గరగా ఉన్నాయి. అయితే డిఫరెంట్ డిజైన్ , u-shaped antennaతో ఈఫోన్ రానున్నట్లు తెలుస్తోంది.

4 రోజుల పాటు Flipkart ఫ్లాష్ సేల్స్, రూపాయి సేల్ కూడా..4 రోజుల పాటు Flipkart ఫ్లాష్ సేల్స్, రూపాయి సేల్ కూడా..

దీని ధర రూ సుమారు అక్కడ రూ.11,700గా ఉండే అవకాశం ఉంది. ఇండియాకి వచ్చే సరికి ఈ ఫోన్ ధర రూ. 10,000 ఉండే అవకాశం ఉందని సమాచారం. అయితే ధరపై ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. కాగా ఈ మధ్య లాంచ్ చేసిన Redmi 5 కన్నా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. Redmi 5 2జిబి ర్యామ్ స్టార్టింగ్ ధర రూ. 7,999గా ఉంది. ఇండియాలో ఇది ఆండ్రాయిడ్ వన్ డివైస్ కింద విడుదలయ్యే అవకాశం ఉంది.

Redmi S2 ఫీచర్లు ( రూమర్స్ )
5.99 అంగుళాల IPS LCD డిస్‌ప్లే (18: 9 రేషియో), 720x1440 ఫుల్‌హెచ్‌డీ పిక్సల్స్ రిజల్యూషన్‌, ఆక్టాకోర్ స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్, 2/3/4 జీబి ర్యామ్, 16/32/64 జీబీ స్టోరేజ్‌, microSD card slot, హైబ్రిడ్ డ్యూయెల్ సిమ్, 12 ఎంపీ ప్రాధమిక సెన్సార్ , 5ఎంపీ సెకండరీ సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా విత్ సెల్ఫీ లైట్ ఫీచర్, Wi-Fi 802.11 a/b/g/n, Bluetooth 4.2 Low Energy, GPS with A-GPS, GLONASS, BeiDou, 4G VoLTE, IR blaster, fingerprint sensor, 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 170 గ్రాములు బరువు, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత MIUI 9.

Best Mobiles in India

English summary
Redmi S2 Confirmed to be Launched on May 10: Expected Price in India, Specifications More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X