ఒప్పో, వివోలకు షాక్.. బరిలోకి రెడ్‌మి వై1

Posted By: BOMMU SIVANJANEYULU

సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తిరుగులేని బ్రాండ్‌లుగా అవతరించిన ఒప్పో, వివోలకు షాకిస్తూ షావోమి తన మొట్టమొదటి సెల్ఫీ సెంట్రిక్ స్మార్ట్‌ఫోన్‌ Redmi Y1ను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్‌కు సంబంధించి లైటర్ వర్షన్‌ Redmi Y1 Liteను కూడా కంపెనీ విడుదల చేసింది.

ఒప్పో, వివోలకు షాక్.. బరిలోకి రెడ్‌మి వై1

ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను అమెజాన్ ఇండియా ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది. నవంబర్ 8 నుంచి సేల్ స్టార్ట్ అవుతుంది. మార్కెట్లో వీటి ధరలను పరిశీలించినట్లయితే Redmi Y1 3జీబి ర్యామ్ + 32జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.8,999. Redmi Y1 4జీబి ర్యామ్ + 64జీబి స్టోరేజ్ వర్షన్ ధర రూ.10,999. Redmi Y1 Lite ధర రూ.6,999. Redmi Y1 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన మొదటి లుక్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా Redmi Y1 ప్రత్యేకతలు..

మెటల్ యునిబాడీ డిజైన్, 5.5 అంగుళాల ఐపీఎస్ హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ నౌగట్ 7.0 ఆపరేటింగ్ సిస్టం, MIUI 8 కస్టమైజిడ్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4Ghz క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 435 ఆక్టా కోర్ ప్రాసెసర్, ర్యామ్ వేరియంట్స్ (3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (32జీబి,64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3080mAh బ్యాటరీ.

హెవీగా కనిపించినప్పటికి ఇది కంఫర్టబుల్ ఫోన్..

Redmi Y1 ఫోన్ సైడ్ భాగాలు గుండ్రటి అంచులతో కనిపిస్తున్నాయి. ఫోన్ ఫ్రంట్ ప్యానల్‌ క్రింది భాగంలో ఏర్పాటు చేసిన మూడు టచ్ కెపాసిటివ్ బటన్స్ పర్‌ఫెక్ట్ ప్లేస్‌మెంట్స్‌తో కనిపిస్తున్నాయి. ప్యానల్ పై భాగంలో అమర్చిన ఫ్రంట్ కెమెరా అలానే యాంబియంట్ లైట్ సెన్సార్స్‌ డీసెంట్ లుక్‌తో కనిపిస్తున్నాయి

ఈ ఫోన్‌కు సంబంధించిన వాల్యుమ్ రాకర్స్ అలానే లాక్/అన్‌లాక్ టాగిల్స్ ఫోన్ రైట్ సైడ్ భాగంలో కనిపిస్తాయి. సిమ్ ట్రేను లెఫ్ట్ సైడ్ భాగంలో అమర్చటం జరిగింది. ఫోన్ రేర్ ప్యానల్‌ను గమనించిట్లయితే, టాప్ రైట్ కార్నర్‌లో ప్రైమరీ కెమెరాను, దాని పక్కనే ఎల్ఈడి ఫ్లాష్‌ను అమర్చి ఉంచారు. ప్యానల్ సెంటర్ భాగంలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఫిట్ చేయటం జరిగింది.

స్పీకర్ గ్రిల్స్‌తో పాటు మైక్రో యూఎస్బీ 2.0 పోర్టును ఫోన్ బేస్ ఎడ్జ్‌ భాగంలో ప్లేస్ చేయటం జరిగింది. టాప్ ఎడ్జ్ భాగంలో 3.5 mm ఆడియో జాక్‌‌ను అమర్చటం జరిగింది. ప్రొఫెషనల్ స్థాయిలో డిజైన్ కాబడిన Redmi Y1 కంఫర్టబుల్ గ్రిప్‌ను ఆఫర్ చేస్తుంది. సింగిల్ హ్యాండ్‌తో ఈ డివైస్‌ను ఆపరేట్ చేసే వీలుంటుంది.

కెమెరా క్వాలిటీ కేక...

Redmi Y1 స్మార్ట్‌ఫోన్ ఫ్రంట్ పోర్షన్‌లో అమర్చిన 16 మెగా పిక్సల్ సెల్ఫీ కెమెరా తక్కువ వెళుతురు కండీషన్స్‌లోనూ అత్యుత్తమంగా రెస్పాండ్ అవుతోంది. ఈ కెమెరాతో చిత్రీకరించిన షాట్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 13 మెగా పిక్సల్ కెమెరా రెడ్‌మి 4ఏ కెమెరాను తలపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే, Redmi Y1 స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్రంట్ ఇంకా బ్యాక్ కెమెరాలు స్థాయికి తగ్గ పనితీరును కనబరుస్తున్నాయి.

మార్కెట్లోకి సెన్‌హైజర్ XS 1 మైక్రోఫోన్

పెర్ఫామెన్స్ ఎలా ఉందంటే..?

పెర్ఫామెన్స్ పరంగా చూస్తే Redmi Y1 స్మార్ట్‌ఫోన్ చాలా స్మూత్‌గా రన్ అవుతోంది. యాప్స్ మధ్య స్విచ్చింగ్ వేగవంతంగా జరుగుతోంది. యాప్స్ కూడా చాలా వేగంగా ఓపెన్ అవుతున్నాయి. ఫోన్‌లోని మిగిలిన విభాగాల పనితీరును పరిశీలించాల్సి ఉంది.

రూ.1000 ప్రైస్ పాయింట్‌లో బెస్ట్ ఫోన్ అవుతుందా..?

ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లో ఉండాల్సిన అన్ని రకాల ఫీచర్లు Redmi Y1 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. ప్రత్యేకంగా యువతను టార్గెట్ చేస్తూ డిజైన్ చేయబడిన రెడ్‌మి వై1, ముఖ్యంగా సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునే అవకాశం ఉంది. కెమెరా డిపార్ట్‌మెంట్‌ను పక్కన పెడితే Snapdragon 435 SoC ఫోన్‌కు మరో హైలైట్‌గా చెప్పుకోవచ్చు. Redmi Y1కు సంబంధించిన పూర్తి రివ్యూను త్వరలోనే మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi Redmi Y1 has been launched today for a price of Rs. 8,999 for 3GB RAM and 32GB ROM and 4GB RAM and 64 GB ROM version in India.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot