Home
Mobile

ఇండియా మార్కెట్లోకి షియోమి మరో కొత్త ఫోన్, బెస్ట్ ఫీచర్స్ ఇవే..

By Anil

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం తయారీదారు Xiaomi ఇండియాలో మరో స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. కొన్ని రోజుల క్రితం చైనాలో విడు దల చేసిన Redmi S 2 కి మరిన్ని ఫీచర్లు జోడించి దీన్ని ఇండియా మార్కెట్లోకి తీసుకువస్తోంది. ఈ రోజు డిల్లీలో అధికారికంగా Redmi Y2 ని కంపెనీ లాంచ్ చేయనుంది. కాగా Redmi Y1 విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా Xiaomi Redmi Y2 ఫోన్ లాంచ్ కాబోతొంది. Redmi Y1 ఇండియాలో భారీ అమ్మకాలను కొల్లగొట్టిన నేపథ్యంలో రానున్న ఫోన్ Xiaomi Redmi Y2 కూడా అదే విధంగా అమ్మకాల్లో దూసుకుపోతుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఫోన్ ఫీచర్ల పరంగా ఇతర ఫోన్లకు సవాల్ విసిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియాలో ఈ ఫోన్ ధర సుమారుగా రూ. 11,999గా వుండే అవకాశం వుంది. ఈ అమెజాన్ ద్వారా exclusiveగా అందుబాటులోకి రానుంది.

Redmi Y2

ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 16 ఎంపీ ai కెమెరాతో ప్రత్యేక ఆకర్షణ గా నిలవనుంది.
5.99 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 12,మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ

కాగా గత ఏడాది విడుదలైన Redmi Y1 ఫీచ‌ర్ల కింది విధంగా ఉన్నాయి.
5.5 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1. 4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 435 ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫ్లాష్), ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 3080 ఎంఏహెచ్ బ్యాటరీ

More from GizBot

Best Mobiles in India

English summary
Xiaomi Redmi Y2 India Launch Expected Today: How to Watch Live Stream to know more visit gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X