త్వరలో ఇండియా మార్కెట్లోకి రానున్న షియోమి గేమింగ్ స్మార్ట్‌ఫోన్ 'బ్లాక్ షార్క్'

చైనా దిగ్గజం షియోమి తన మరో సంచలనానికి రెడీ అయినట్లు తెలుస్తోంది.

|

చైనా దిగ్గజం షియోమి తన మరో సంచలనానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదిరిపోయే ఫీచర్లతో మొబైల్స్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చిన షియోమి ఇప్పుడు మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ ని ఇండియా మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అదిరిపోయే ఫీచర్లతో తొలిసారిగా బ్లాక్ షార్క్ పేరిట‌ ఓ నూత‌న‌ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌ను షియోమి ఇండియా మార్కెట్లోకి విడుదల చేయనుంది.మరికొద్ది రోజుల్లో యూరప్ మరియు భారతదేశంతో సహా అంతర్జాతీయ మార్కెట్లలో బ్లాక్ షార్క్ ఫోన్ ను విడుదల చేసేందుకు షియోమి కంపెనీ రెడీ అయింది. ఇప్పటికే ఈ ఫోన్‌కు చెందిన పలు టీజర్ ఇమేజ్‌లను షియోమీ విడుదల చేయగా వాటి పట్ల స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ఫోన్ గురించి మరి కొన్ని విషయాలు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి....

డిజైన్ పరంగా...

డిజైన్ పరంగా...

స్మార్ట్‌ఫోన్ బ్లాక్ షార్క్ యూజర్ చేతుల్లో సౌకర్యవంతంగా ఇమిడిపోతుంది. ఈ ఫోన్ ఆఫర్ చేసే గ్రిప్ కంఫర్టబుల్ ఫీల్‌ను చేరువచేస్తుంది. లైట్ వెయిట్‌కు తోడు గుండ్రటి కార్నర్స్ ఫోన్‌కు ప్రొఫెషనల్ లుక్‌ను తీసుకువచ్చాయి. ఫోన్ మందం 9.25 మిమీ మరియు 190 గ్రాముల బరువు ఉంటుంది.

సూపర్ బ్రైట్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే...

సూపర్ బ్రైట్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే...

షియోమి బ్లాక్ షార్క్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ లో 550 nits మరియు 18: 9 acpect ratioతో 5.99 అంగుళాల సూపర్ బ్రైట్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే,1080x2160 పిక్సెల్స్ స్క్రీన్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది .

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్....

షియోమీ గేమింగ్ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 8.0 ఓరియో, ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే వంటి పవర్‌ఫుల్ ఫీచర్లు ఉండనున్నట్లు తెలిసింది.

షియోమి బ్లాక్ షార్క్ ఒక ప్రత్యేక గేమ్ ప్యాడ్ తో వస్తుంది....

షియోమి బ్లాక్ షార్క్ ఒక ప్రత్యేక గేమ్ ప్యాడ్ తో వస్తుంది....

షియోమి కంపెనీ బ్లాక్ షార్క్ మొబైల్ కోసం ఒక కంట్రోలర్ డాక్ ను అందిస్తుంది. ఇది తప్పనిసరిగా ఫోన్కు జోడించే ఒక అనలాగ్ కంట్రోలర్. కంట్రోలర్, దీని ధర సుమారు రూ. 1900 ఉండవచ్చు . ఎగువ భాగంలో ఒక జాయ్స్టిక్ మరియు ట్రిగ్గర్ బటన్లను కలిగి ఉంటుంది.

ధర...

ధర...

చైనాలో ఈ బ్లాక్ షార్క్ ఫోన్ 6GB RAM / 64GB వేరియంట్ ధర సుమారు రూ.31,100 గా ఉంది అలాగే 8GB RAM / 128GB వేరియంట్
ధర సుమారు రూ.36,300 గా ఉంది. పోలార్ నైట్ మరియు నైట్ గ్రే రంగుల్లో అందుబాటులో ఉంటుంది.భారతదేశంలో, బ్లాక్ షార్క్ ఫోన్ ధర సుమారు రూ. 35,000 ఉండవచ్చు అని అంచన.

 

 

Best Mobiles in India

English summary
Xiaomi's Black Shark gaming smartphone could soon launch in India.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X