ఇప్పటి వరకు 45 లక్షలు , ఎగబడి కొంటున్న ఫోన్స్ ఇవే!

ప్రపంచ మార్కెట్లకు ధీటుగా ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ దూసుకుపోతోంది. ముఖ్యంగా చైనా ఫోన్‌ల కంపెనీ Xiaomi, తన రెడ్మీ ఫోన్‌లతో భారత్‌లో సంచలనాలు నమోదు చేస్తోంది. ఈ ఏడాది మూడవ క్వార్టర్ (జూలై-సెప్టంబర్)కు గాను భారత్‌లో తాము 20 లక్షల ఫోన్‌లను విక్రయించినట్లు షియోమీ ఇండియా హెడ్ మను కుమార్ జైన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు.

Read More : రూ.148 చెల్లిస్తే, నెలంతా కాల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

150 శాతం వృద్ది..

గతేడాది ఇదే సమయంలో అమ్ముడైన ఫోన్‌లతో పోలిస్తే 150శాతం వృద్దిని కనబర్చినట్లు ఆయన తెలిపారు. ఇదే ఏడాది జనవరి - మార్చి, ఏప్రిల్ - జూన్‌‌లతో ముగిసిన మొదటి, రెండు త్రైమాసికాల్లోనూ 10 లక్షల నుంచి 15 లక్షల ఫోన్ లను తాము విక్రయించగలిగినట్లు మను కుమార్ పేర్కొన్నారు.

కలిసొచ్చిన అంశాలు..

తమ ఫోన్‌లను మరిన్ని ఆన్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంచటం, ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అడుగుపెట్టడం, రెడ్మీ నోట్ 3, రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు వెంటవెంటనే మార్కెట్లో హిట్ అవ్వటం వంటి అంశాలు షియోమీకి మరింతగా కలిసొచ్చాయి.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

23 లక్షల కంటే ఎక్కువ రెడ్మీ నోట్3 ఫోన్‌లు..

ఈ ఏడాది మార్చిలో విడుదలైన రెడ్మీ నోట్ 3 ఫోన్‌లను దాదాపుగా 23 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు కొనుగోలు చేసినట్లు షియోమీ తెలిపింది.

10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు..

ఇదే సమయంలో ఆగష్టులో లాంచ్ అయిన రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లను ఇప్పటి వరకు 10 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు సొంతం చేసుకున్నట్లు షియోమీ ఇటీవల వెల్లడించింది. ఒక్క దీపావళి సీజన్‌లోనే, మూడు రోజుల వ్యవథిలో 2,50,000 ఫోన్ లను విక్రయించినట్లు షియోమీ చెబుతోంది.

2014లో ఆన్‌లైన్ ఓన్లీ బ్రాండ్ అవతరించి..

ఇండియన్ మార్కెట్లో షియోమీ ఫోన్‌ల ప్రస్థానాన్ని పరిశీలించినట్లయితే 2014లో ఆన్‌లైన్ ఓన్లీ బ్రాండ్‌గా షియోమీ మార్కెట్లోకి అడుగుపెట్టింది. చాలా కాలం వరకు షియోమీ ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించేంది.

అమెజాన్, స్నాప్‌డీల్‌లో కూడా..

వ్యాపార విస్తరణలో భాగంగా తన ఆన్‌లైన్ అందుబాటును అమెజాన్ ఇండియా, స్నాప్‌డీల్, పేటీఎమ్, టాటా‌క్రిక్ వంటి ఈ-కామర్స్ కంపెనీలకు షియోమీ విస్తరించింది.

ఐడీసీ నివేదిక ప్రకారం..

ఇటీవల విడదులైన ఐడీసీ నివేదిక ప్రకారం లెనోవో - మోటరోలా తరువాత, భారత్‌లో రెండవ అతిపెద్ద ఆన్‍‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షియోమీ అవతరించింది.

ఆఫ్‌లైన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది

తాజాగా ఆఫ్‌లైన్ మార్కెట్లోకి షియోమీ అడుగుపెట్టింది. రెడ్డింగ్ టన్, జస్ట్ బుయ్ లైవ్, ఇన్నోకామ్, స్టోర్ కింగ్, వైఎమ్ఎస్ మొబీటెక్ వంటి పంపిణీదారులతో చేతులు కలిపిన షియోమీ దేశవ్యాప్తంగా 8,500 రిటైల్ స్టోర్‌లలో తన రెడ్మీ ఫోన్ లను అందుబాటులో ఉంచింది. 8.4శాతం మార్కెట్ వాటాతో షియోమీ కంపెనీకి భారత్ రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అయ్యింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi sales grow 150% in India, sells 2 million smartphones in Q3 2016: Manu Kumar Jain. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot