కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

Written By:

కొత్త స్మార్ట్‌ఫోన్ ఆవిష్కరణలతో ఏప్రిల్ మార్కెట్ హీటెక్కబోతోంది. ముఖ్యంగా యాపిల్ విడుదల చేయబోతోన్న చౌకధర ఫోన్ ఐఫోన్ ఎస్ఈ (iPhone SE)కి సామ్‌సంగ్, షియోమీ వంటి పోటీ బ్రాండ్‌లు పెద్ద షాక్‌ను ఇవ్వబోతున్నాయి. 4 అంగుళాల స్ర్కీన్ సైజులో యాపిల్ డిజైన్ చేసిన 'ఐఫోన్ ఎస్ఈ' ఇండియన్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది.

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా! .

ఏప్రిల్ 8 నుంచి రిటైల్ మార్కెట్లో లభ్యమయ్యే ఈ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర రూ.39,000 ఉండొచ్చని ఓ అంచనా. ఐఫోన్ 5ఎస్ సైజులో ఉండే ఈ ఫోన్‌లో ఐఫోన్ 6ఎస్ తరహా స్పెక్స్‌ను యాపిల్ పొందుపరిచింది. మరిన్ని వివరాలు క్రింది స్లైడ్ షోలో...

Read More : ముఖాలను స్కాన్ చేసే పోలీస్ కార్లు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

iPhone SE స్పెసిఫికేషన్స్

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

ఫోన్ స్పెక్స్ పరిశీలించినట్లయితే.. 4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే. యాపిల్ ఏ9 సాక్, ఎం9 మోషన్ కోప్రాసెసర్ విత్ ‘Hey Siri' ఫీచర్, ఐఓఎస్ 9.3 ఆపరేటింగ్ సిస్టం, 12 మెగా పిక్సల్ ఐసైట్ కెమెరా (లైవ్ ఫోటోస్ ఇంకా 4కే వీడియో రికార్డింగ్ సపోర్ట్), 1.2 మెగా పిక్సల్ ఫేస్ టైమ్ కెమెరా విత్ రెటీనా ఫ్లాష్, 4జీ ఎల్టీఈ సపోర్, బ్లుటూత్ 4.2, వై-ఫై కనెక్టువిటీ, సరికొత్త మైక్రోఫోన్ వ్యవస్థ యాపిల్ పే సపోర్ట్ విత్ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్.

షియోమీ ఎంఐ 5

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

మరోవైపు, చైనా స్మార్ట్‌ఫోన్ మేకర్ షియోమీ తన ఫ్లాగ్‌షిప్ కిల్లర్ ఫోన్ ఎంఐ 5 (Mi 5)ను గురువారం ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతోంది. శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్‌ అలానే 5.15 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లేతో రానున్న ఈ ఫోన్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.25,000 ఉండొచ్చని ఓ అంచనా.

షియోమీ ఎంఐ 5

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

చైనా మార్కెట్లో ఈ ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్ (32జీబి, 64జీబి, 128జీబి)లలో లభ్యమవుతోంది. ఇండియన్ మార్కెట్లో లభ్యమయ్యే ఎంఐ 5 స్టోరేజ్ వేరియంట్స్ కు సంబంధించిన పూర్తి వివరాలు మరికొద్ది గంటల్లో వెల్లడవుతాయి.

షియోమీ ఎంఐ 5

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆధారంగా అభివృద్థి చేసిన ఎంఐయూఐ 7 ప్లాట్ ఫామ్ పై ఫోన్ రన్ అవుతుంది. 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ అలానే 4 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలు ఆకట్టుకుంటాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ జే3

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

మరోవైపు సామ్‌సంగ్, ఇండియన్ బైక్ రైడర్స్ కోసం ప్రత్యేకమైన స్మార్ట్ ఫోన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. గేలాక్సీ జే3 పేరుతో రాబోతున్న ఈ 5 అంగుళాల సూపర్ హైడెఫినిషన్ ఫోన్ లో ప్రత్యేకమైన "Bike Mode" ఫీచర్‌ను సామ్‌సంగ్ పొందుపరిచింది.

బైక్ మోడ్‌

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

బైక్ రైడ్ చేస్తున్న సమయంలో ఫోన్‌లోని బైక్ మోడ్‌ను ఆన్ చేసుకున్నట్లయితే, వచ్చే కాల్స్ కు మీరు కాల్ స్వీకరించే స్థితిలో లేరని ఓ టెక్స్ట్ మెసేజ్‌ను ఈ మోడ్ ఆటోమెటిక్‌గా పంపేస్తుంది.

గెలాక్సీ జే3 స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

.1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

గెలాక్సీ ఎస్7, గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

సామ్‌సంగ్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ గెలాక్సీ ఎస్7 అలానే గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లు ఇప్పటికే మార్కెట్లో దొరుకుతోన్న విషయం తెలిసిందే. ఎస్ 7 ధర రూ.48,900 కాగా, ఎస్7 ఎడ్జ్ ధర రూ.56,900.

ఉచిత Gear వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

ఈ ఫోన్‌లను మందస్తుగా బుక్ చేసుకున్న వారికి ఉచిత Gear వర్చువల్ రియాల్టీ హెడ్‌సెట్‌లను సామ్‌సంగ్ ఆఫర్ చేసింది.

రెడ్మీ నోట్ 3

కొత్త ఫోన్‌లు వచ్చేస్తున్నాయ్.. మీరు సిద్ధమేనా!

మరోవైపు బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ షియోమీ తన రెడ్మీ నోట్ 3ని మార్కెట్లో లాంచ్ చేసింది. శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 650 ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 2జీబి ర్యామ్ 16జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న హ్యాండ్‌సెట్ ధర రూ.9,999 కాగా, 3జీబి ర్యామ్ 32జీబి ఇంటర్నల్ మెమరీతో వస్తోన్న ఫోన్ ధర రూ.11,999.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi and Samsung to launch their iPhone SE Killer Flagships on March 31st in India. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot