10 లక్షల ఫోన్‌లు అమ్మారు, అయినా క్రేజ్ తగ్గలేదు!

బడ్టెట్ ఫ్రెండ్లీ 4జీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ షియోమీ గడచిని ఆగష్టులో రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లను ఇండియాలో లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

10 లక్షల ఫోన్‌లు అమ్మారు, అయినా క్రేజ్ తగ్గలేదు!

పూర్తి మెటల్ బాడీతో రూపుదిద్దుకున్న ఈ ఫోన్‌లను రూ.6,999 ప్రారంభ ధర ట్యాగ్‌తో Mi.com అలానే Flipkartలలో అందుబాటులో ఉంచటం జరిగింది. ఈ ఫోన్‌లు మార్కెట్లో విడుదలైన మూడు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పలు ఆసక్తికర వివరాలను ప్లిప్‌కార్ట్ వెల్లడించింది.

Read More : ఎయిర్‌టెల్ చేతికి ఎయిర్‌సెల్ 4జీ, ఇక దూకుడే

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

10 లక్షల రెడ్మీ 3ఎస్ ఫోన్‌లు..

LYF 4G ఫోన్‌ను రూ.1000కే పొందటం ఎలా?

ఈ మూడు నెలల వ్యవధిలో తాము 10 లక్షల రెడ్మీ 3ఎస్, 3ఎస్ ప్రైమ్ ఫోన్‍‌లను విజయవంతంగా విక్రయించిగలిగినట్లు ప్లిప్‌కార్ట్ వెల్లడించింది. షియోమీ నుంచి గతంలో విడుదలైన రెడ్మీ నోట్ 3 ఫోన్ కూడా భారత్‌లో అమ్మకాల సునామీను సృష్టించిన విషయం తెలిసిందే. సెప్టంబర్ వరకు 23 లక్షల రెడ్మీ నోట్ 3 ఫోన్‌లు భారత్‌లో అమ్ముడయ్యాయని షియోమీ ప్రకటించిన విషయం తెలిసిందే.

3జీబి ర్యామ్, 2జీబి ర్యామ్ వేరియంట్స్..

పోయిన ఫోన్‌లను వెతికి పట్టుకోవటం చాలా సులువు..

రూ.8,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంచిన రెడ్మీ 3ఎస్ ప్రైమ్..3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్ వంటి పటిష్టమైన ఫీచర్లను కలిగి ఉంది. రూ.6,999 ధర ట్యాగ్‌లో అందుబాటులో ఉంచిన రెడ్మీ 3ఎస్.. 2జీబి, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వంటి స్పెక్స్‌తో వస్తోంది. మిగిలిన ఫీచర్లు ఈ రెండు ఫోన్‌లలో సమానంగా ఉంటాయి. రెడ్మీ 3ఎస్, రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌ల స్పేసిఫికేషన్‌లకు సంబంధించిన 10 ఆసక్తికర విషయాలను ఇప్పుడు చూద్దాం...

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి..

వాట్సాప్ వీడియో కాల్స్‌కు ఎంత డేటా ఖర్చవుతుంది..?

డిజైనింగ్ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ అలానే రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు రెడ్మీ నోట్ 3కి దగ్గరగా ఉంటాయి. ఈ ఫోన్‌లు మందం 8.5 మిల్లీ మీటర్లు. బరువు విషయానికి వచ్చేసరికి 144 గ్రాములు. మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్‌లు ప్రీమియమ్ లుక్‌ను చేరువ చేస్తాయి. బ్యాటరీ విషయానికి వచ్చేసరికి రెడ్మీ 3ఎస్ అలానే రెడ్మీ 3ఎస్ ప్రైమ్ ఫోన్‌లు 4100 ఎమ్ఏహెచ్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి.

 

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి...

ఫోన్ రూటింగ్.. పెద్ద రిస్క్!

ఈ రెండు ఫోన్‌లలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్‌ను నిక్షిప్తం చేసారు. అడ్రినో 505 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్‌ ఫోన్ గ్రాఫిక్ విభాగాన్ని చూసుకుంటుంది. స్టోరేజ్ అలానే ర్యామ్ విషయానికి వచ్చే సరికి... రెడ్మీ 3ఎస్ ప్రైమ్ (3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ), రెడ్మీ 3ఎస్ (2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ)లను కలిగి ఉంటాయి. మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఈ రెండు ఫోన్‌లకు సంబంధించిన స్టోరేజ్‌ను 128జీబి వరకు విస్తరించుకోవచ్చు.

 

డిస్‌ప్లే విషయానికి వచ్చేసరికి..

ఇప్పుడు మీ వాట్సాప్ అకౌంట్ మరింత సేఫ్

ఈ రెండు ఫోన్‌లలో 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేను ఏర్పాటు చేసారు. రిసల్యూషన్ వచ్చేసరికి720x 1280పిక్సల్స్. కెమెరా విషయానికి వచ్చేసరికి.. ఈ రెండు ఫోన్‌లలో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను చూడొచ్చు. (ఎల్ఈడి ఫ్లాష్, పీడీఏఎఫ్, ఫుల్ హైడెఫినిషన్ 1080 పిక్సల్ రికార్డింగ్, హెచ్‌డీఆర్, హెచ్‌హెచ్‌టీ వంటి ప్రత్యేకతలు ఈ కెమెరాలలో ఉన్నాయి).

సాఫ్ట్‌వేర్ విషయానికి వచ్చేసరికి..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ రెండు ఫోన్‌లు ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా అభివృద్థి చేసిన MIUI 7 యూజర్ ఇంటర్‌ఫేస్ పై రన్ అవుతాయి. ఈ రెండు ఫోన్‌లలో కనెక్టువిటీ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 4జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఆర్ఎస్, జీపీఎస్, గ్లోనాస్.

ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌..

లేటెస్ట్ ల్యాప్‌టాప్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెడ్మీ 3ఎస్ ప్రైమ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ సపోర్ట్‌తో వస్తోంది. మోటో జీ4, సామ్‌సంగ్ గెలాక్సీ జే5 (2016), లెనోవో వైబ్ కే5 ప్లస్ ఫోన్‌లకు రెడ్మీ 3ఎస్ ప్రధాన పోటీగా నిలిచింది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi sells over 1 million Redmi 3S and Redmi 3S Prime smartphones on Flipkart. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot