18 రోజుల్లో 10 లక్షల ఫోన్‌లు అమ్మిన Xiaomi

ప్రముఖ చైనా ఫోన్‌ల కంపెనీ షియోమీ (Xiaomi).. 18 రోజుల్లో 10 లక్షల ఫోన్‌లను విక్రయించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఈ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని షియోమీ ఆఫర్ చేస్తున్న రెడ్మీ ఫోన్‌లు దాదాపుగా అన్ని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో లభ్యమవుతున్నాయి.

18 రోజుల్లో 10 లక్షల ఫోన్‌లు అమ్మిన  Xiaomi

Read More : పండగ చేస్కోండి.. ఆ సామ్‌సంగ్ ఫోన్‌ పై ఏకంగా రూ.30,000 తగ్గింపు

అంతే కాకుండా, తన సొంత ఈ-కామర్స్ మార్కెట్లో ప్లేస్ అయిన mi.comలో దీపావళి సేల్ ‌ను షియోమీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రెడ్మీ ఫోన్‌లకు ఇండియన్ యూజర్లు బ్రహ్మరథం పట్టిన నేపథ్యంలో ఆ కంపెనీ సీఈఓ Lei Jun ఇండియన్ యూజర్లను ఉద్దేశించి ఓ కృతజ్ఞత లేఖను షియోమీ ఫేస్‌బుక్ పేజీలొ పోస్ట్ చేసారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Mi ఇండియన్ ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు..

18 రోజుల్లో 10 లక్షల ఫోన్‌లను విక్రయించి భారత్‌లో సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పాం, షియోమీ మేనేజ్‌మెంట్ తరుపున Mi India teamను అభినందిస్తున్నాను. ముఖ్యంగా షియోమీ ఫోన్‌లను ఇంతలా ఆదరిస్తోన్న Mi ఇండియన్ ఫ్యాన్స్‌కు పేరుపేరునా కృతజ్ఞతలంటూ Jun తన లేఖలో పేర్కొన్నారు. ఇదే సమయంలో తమ రిటైల్ పార్టనర్స్ అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇండియా, స్నాప్‌డీల్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మూడు రోజుల్లో 5 లక్షల స్మార్ట్‌ఫోన్‌లు

ఆన్‌లైన్ దివాళి సేల్ ప్రారంభమైన మొదటి మూడు రోజుల్లోనే 5 లక్షల స్మార్ట్‌ఫోన్‌లను విక్రయించినట్లు షియోమీ కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

Redmi Note 3 లాంచ్ తరువాత..

ఇండియన్ మార్కెట్లో Redmi Note 3 లాంచ్ తరువాత షియోమీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుంది. కేవలం 7 నెలల వ్యవధిలో 23 లక్షల రెడ్మీ నోట్ 3 ఫోన్లను ఇక్కడి మార్కెట్లో విక్రయించి షియోమీ సరికొత్త రికార్డును నెలకొల్పింది.

మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతు

ప్రధాన మంత్రి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతునిచ్చిన మొట్టమొదటి చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా Xiaomi నిలిచింది.

ఐడీసీ రిపోర్ట్స్ ప్రకారం..

ఐడీసీ నివేదిక ప్రకారం జూలై - ఆగష్టు 2016 మధ్య #1 ఆన్‌లైన్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షియోమీ నిలిచింది.

మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ వెండర్‌గా

ఐడీసీ నివేదిక ప్రకారం సెప్టంబర్ 2016కు గాను మూడవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ వెండర్‌గా షియోమీ నిలిచింది. టాప్ 30 ఇండియన్ సిటీలలో 8.4% మార్కెట్ వాటాను షియోమీ చేజిక్కించుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Xiaomi sells 1 million smartphones in India in 18 days. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot